103 జ్వరంతో శ్రీదేవితో డ్యాన్స్ చేశా.. అప్పటి విషయాలు అలా బయటపెట్టిన చిరంజీవి!

గత రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే ఈయన ఆ తరం నుంచి ఈ తరం ప్రేక్షకుల వరకు మంచి అభిమాన హీరో గా మారాడు.

 Chiranjeevi, Tollywood, Sridevi, Allu Ramalingaiah , Jagadeka Veerudu Athiloka S-TeluguStop.com

ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా ఈ తరం హీరోయిన్లతో నటిస్తున్నాడు.ఒకప్పటి హీరోయిన్ ల నుండి ఈ తరం హీరోయిన్ల వరకు చిరంజీవి నటిస్తున్నాడు అంటే గొప్ప విషయమే.

వయసు మీద పడినా కూడా ఇంకా కుర్రాడిలా కుర్ర హీరోయిన్లతో తెగ చిందులేస్తున్నాడు.ఇక ప్రస్తుతం వరుస అవకాశాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమాతో ఎందుకో అంతగా మెప్పించలేకపోయాడు చిరంజీవి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒకప్పటి విషయాలను బయట పెట్టాడు చిరు.

నిన్న మేడే సందర్భంగా యూసఫ్ గూడలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో ఫిలిం ఫెడరేషన్ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.ఇందులో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు.కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్ ఇవ్వడం నా బాధ్యతగా భావించాను అంటూ.

సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాల్సిన నేను అండగా ఉంటాను అని.మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే అని అన్నాడు.

Telugu Acharya, Chiranjeevi, God, Jagadekaveerudu, Ram Charan, Sridevi, Tollywoo

అంతేకాకుండా మరి కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ.ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి సహకరించారని అందుకు వారికి కృతజ్ఞతలు అని తెలిపాడు.సినీ పరిశ్రమ కోసం ఎంతో మంది ఆర్టిస్టులు కూడా త్యాగం చేశారు అని అన్నాడు.కె.బి.తిలక్, అల్లు రామలింగయ్య, నూతన ప్రసాద్ వంటి సీనియర్ నటులు గుండె నిండా విషాదం ఉన్న సమయంలో కూడా సినీ ఇండస్ట్రీలో పని చేశారు అని అన్నాడు.

Telugu Acharya, Chiranjeevi, God, Jagadekaveerudu, Ram Charan, Sridevi, Tollywoo

తన తల్లి చనిపోయిన కూడా రామలింగయ్య షూటింగ్ కు వెళ్లాడని.తాను అంత బాధలో ఉన్నా కూడా మన కోసం నవ్వులు పండించాడు అని అన్నాడు.ఇక తను కూడా జగదీక వీరుడు అతిలోక సుందరి సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నీరసంగా ఉన్నాను అని.తనకు ఆ సమయంలో 103 జ్వరం ఉందని అన్నాడు.అయినా కూడా అలా బాధ పడుతూనే శ్రీదేవితో కలిసి డాన్స్ చేశాను అని.షూటింగ్ తర్వాత పదిహేను రోజులు ఆసుపత్రిలో చేరాను అని అన్నాడు.ఇక ఇప్పుడు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కోసం కూడా ముంబై, హైదరాబాద్ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని.డల్ గా ఉన్నాను అని చెప్పితే షూటింగ్ ఆగిపోతుందని కానీ అది తనకు నచ్చదు అని అన్నాడు.

ఇక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తర్వాత ఉన్న ప్రాజెక్టులలో బాగా బిజీ గా మారాడు.ఇక ఆ సినిమాలలో చిరంజీవి ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube