బిగ్ బాస్ కార్యక్రమం పై హైకోర్టు సీరియస్... ఇక షో ముగిసినట్టేనా?

బిగ్ బాస్ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారం అవుతూప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా 5 సీజన్లను పూర్తిచేసుకునిప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రసారమవుతుంది.ఇక ఈ కార్యక్రమం మొదటి సీజన్ తో పోలిస్తే తర్వాత సీజన్లు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.

 High Court Serious About The Bigg Boss Show Details, Bigg Boss, Tollywood, High-TeluguStop.com

సరదాగా ప్రేక్షకులను సందడి చేయాల్సిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గొడవలు కాకుండా బూతు మాటలతో, డబుల్ మీనింగ్ డైలాగులతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై వ్యతిరేకత ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ పెద్దఎత్తున డిమాండ్లు వచ్చాయి.

ఇలాంటి ఒక చెత్త కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంపై 2019 వ సంవత్సరంలో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

Telugu Bigg Boss, Anamulla, Ketijagadishwar, Nagarjuna, Tollywood-Movie

ఈ క్రమంలోనే శుక్రవారం జగదీశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి జస్టిస్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాలని సూచించారు.ఇలాంటి కార్యక్రమాలను ప్రచారం చేయటం వల్ల సమాజానికి మంచి చేయక పోవడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంపై ఈ నెల 2వ తేదీన విచారణ జరుపుతామని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.మరి ఈ కార్యక్రమం గురించిసోమవారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube