విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా వస్తుంది.ఈ సినిమా వస్తుంది అని ఎన్నో రోజులుగా వినిపిస్తున్న గత కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా స్టార్ట్ చేసారు.
విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.
ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతోనే అంచనాలు భారీగా పెరిగాయి.విజయ్, సమంత జోడీ అంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.విజయ్ కెరీర్ లో ఈ సినిమా 11వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ రోజు సమంత పుట్టిన రోజు జరుపు కుంటున్న విషయం అందరికి తెలుసు.
ఇప్పటికే సినీ సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు విషెష్ తెలిపారు.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ టీమ్ అందరు సమంత కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
డైరెక్టర్ శివ నిర్వాణ ఒక ఫేక్ సీన్ రాసుకుని సామ్ తో రిహార్సల్ చేయించాడు.విడీ కూడా నిజమే అన్నట్టు సామ్ ను నమ్మించడంతో ఆమె యాక్షన్ చెప్పగానే సామ్, విజయ్ సీన్ లో నటించడం మొదలు పెట్టారు.
సమంత ఎంతో ఎమోషనల్ గా డైలాగ్ కూడా చెప్పింది.
అయితే అదే సమయంలో విజయ్ సమంత చెంపలను తాకుతూ.సమంత అని చెప్పగానే పెద్దగా నవ్వేసింది.వెంటనే విజయ్ తో పాటు టీమ్ అంతా హ్యాపీ బర్త్ డే సమంత అంటూ విషెష్ చెప్పి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ వీడియో అఫిషియల్ గా రిలీజ్ చేయడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.