బాలకృష్ణ, సాయిపల్లవి యాడ్స్ లో నటించకపోవడానికి అసలు కారణాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

సినిమా రంగానికి చెందిన వాళ్లకు డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి.కొంతమంది నటీనటులు సినిమాల ద్వారా ఏ స్థాయిలో సంపాదిస్తారో యాడ్స్ ద్వారా కూడా అదే స్థాయిలో సంపాదిస్తూ ఉంటారు.

 Reasons Behind Saipallavi Balakrishna Not Acted In Ads Details Here Saipallavi,-TeluguStop.com

కొన్ని సెకన్ల పాటు యాడ్స్ లో కనిపిస్తే సినిమా యాక్టర్లకు కోట్ల రూపాయలు పారితోషికంగా దక్కుతుంది.అయితే బాలకృష్ణ, సాయిపల్లవి, మరి కొందరు నటీనటులు యాడ్స్ లో నటించే ఛాన్స్ వచ్చినా సున్నితంగా ఆ ఆఫర్లను వదులుకున్నారు.

బాలయ్య యాడ్స్ లో నటించకపోవడం గురించి ఒక సందర్భంలో స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నేను యాడ్స్ లో నటించకపోవడానికి కారణం మా నాన్నగారు అని ఆయన తెలిపారు.

నాన్నగారు తన నట ప్రస్థానంలో ఎలాంటి యాడ్స్ లో కనిపించలేదని ఆయన కామెంట్లు చేశారు.ప్రస్తుతం తాను కూడా అదే బాటలో నడుస్తున్నానని ఆయన వెల్లడించారు.అభిమానులు నాపై అభిమానం చూపిస్తున్నారని వారిని మభ్యపెట్టి సొమ్ము చేసుకోవాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు.ప్రేక్షకులను సినిమాల ద్వారా అలరించడం బాధ్యత కాబట్టి లైఫ్ లాంగ్ సినిమాలలో నటిస్తానని ఆయన కామెంట్లు చేశారు.

గతంలో ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ఆఫర్ ను సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించారు.ఆ ఆఫర్ ను తిరస్కరించడం గురించి సాయిపల్లవి మాట్లాడుతూ నటిగా వర్క్ ను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లి చపాతీ, అన్నం తింటే తనకు చాలని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Akhanda, Balakrishna, Saipallavi, Skin Tone, Sr Ntr-Movie

ఇంతకంటే తనకు ఎక్కువ మొత్తం అవసరం లేదని ఆమె వెల్లడించారు.యాడ్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తే ఆ డబ్బుతో ఏం చేసుకుంటానని ఆమె ప్రశ్నించారు.విదేశీయులు తెల్లగా ఉన్నా వాళ్లను ఎందుకు తెల్లగా ఉన్నావని మనం ప్రశ్నించమని సాయిపల్లవి కామెంట్లు చేశారు.ఎవరి చర్మం రంగు వాళ్లకు ఉంటుందని సౌందర్య ఉత్పత్తులు చర్మం రంగును ఎలా మార్చగలవని ఆమె ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube