వడ్ల కొనుగోలులో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతు ద్రోహానికి పాల్పడుతున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమీందార్ రెడ్డి అన్నారు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల కేంద్రాలలో రైతు సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖమ్మం లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రేమీందార్ రెడ్డి మాట్లాడుతూ.వడ్ల కొనుగోలు లో కేంద్ర ప్రభుత్వం కు సహకరించకుండా కేసీఆర్ ప్రభుత్వం మిల్లర్ల తో కుమ్మక్కై రైతులను ఆందోళన కు గురి చేసి ఎదో ఒక రేటు కు మిల్లర్ల కు అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తున్నదని మిల్లర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి రైతులను కేసీఆర్ ప్రభుత్వం బలి చేస్తున్నదని ఆయన అన్నారు.
తన పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించి కేంద్రం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు,కేసీఆర్ రైతుల విశ్వాసాన్ని కోల్పోయారని అందుకే trs ధర్నాల్లో రైతులు పాల్గొనటం లేదని అన్నారు,బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం తన బాధ్యత ను విస్మరించి రైతులను మోసగిస్తూ కేంద్రం పై బురద చల్లుతున్నదని అన్నారు.నరేంద్ర మోడీ గారు కేంద్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేసీఆర్ వాటిని అడ్డుకుంటూ రైతుల నోట్లో మట్టి కొడుతోంది అన్నారు,ప్రజలు కేసీఆర్ కి అధికారం ఇచ్చింది పాలించడానికి అని ధర్నాలు చేయడానికి కాదని అన్నారు,బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకరరావు తమ ఇండ్ల పై నల్ల జెండాలు ఎగుర వేయని రైతులు రైతు బంధు వాపసు ఇవ్వాలని అని చెప్పడం విడ్డూరం అని రైతు బంధు పైసలు కేసీఆర్ ఇంటి నుండి ఇవ్వడం లేదని ప్రజలు కట్టిన పన్నుల నుండి ఇస్తున్నారని అన్నారు.
మీరు నల్ల జెండాలు ఎగుర.వేస్తే మేము రైతులతో నరేంద్రమోదీ కి మద్దతు గా కాషాయ జెండాలు రైతులతో ఎగురవేపిస్తామన్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధర కు కొనకపోతే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రైతులకు అండగా నిలబడుతామన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఖమ్మం లో పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ధర్నాలో రైతులు లేరని.
ధర్నా తరువాత మద్యం షాపుల్లో దూరుతున్న ప్యాకేజీ గాళ్ళు వున్నారు అని అన్నారు.లేని సమస్య పై ఆందోళన చేస్తూ పాలన వైఫల్యాల నుండి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ఏనుగుల వెంకట్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, దొంగల సత్యనారాయణ, నరేందర్ రావు ,విజయ రాజు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నున్న రవి,రుద్ర ప్రదీప్,శ్యాం రాథోడ్, బీజేపీ కొత్తగూడెం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేరు నాగేశ్వరరావు, గెంటేలా విద్యాసాగర్ కనమర్లపూడి ఉపేందర్ గుండా శ్రీనివాస్ రెడ్డి, జ్వాల ,sc మోర్చా అధ్యక్షుడు సుదర్శన్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వీరు గౌడ్,నంబూరి రామ లింగేశ్వర రావు,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లా రావు గౌడ్,కోటయ్య నరసింహ రావు బిజ్జమ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్న సదస్సుకు భారీగా రైతులు తరలి రావడం తో సదస్సు విజయవంతం ఐన ది.కేసీఆర్ ప్రభుత్వం వడ్ల పై వివిధ సందర్భాల్లో మాట్లాడిన ద్వంద వైఖరిని కేంద్రం తో చేసుకున్న ఒప్పందం led ద్వారా హాజరు ఐన రైతులకు ప్రదర్శించారు.