ఈ పోర్టబుల్ ఫ్రిజ్‌ని చూస్తే ఎగిరి గంతేస్తారు!

వేసవిలో పోర్టబుల్ ఫ్రిజ్‌లకు డిమాండ్ బాగా పెరుగుతుంది.మీరు కారులో పోర్టబుల్ ఫ్రిజ్‌ని సులభంగా సెటప్ చేసుకోవచ్చు.

 Portable Fridge For Quick Heat And Cold Feature , Portable Fridge ,  Quick Heat-TeluguStop.com

దీంతో విహారయాత్రకు కూడా వెళ్లొచ్చు.పోర్టబుల్ ఫ్రిడ్జ్ ధర రూ.1,500 లోపే అందుబాటులో ఉంది.వేడి చాలా ఎక్కువగా ఉనన పరిస్థితిలో ఎవరైనా సరే చల్లని నీరు లేదా చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు.

అయితే చాలా సార్లు మనం ప్రయాణంలో ఉన్నప్పుడు, శీతల పానీయాలు లేదా చల్లని నీరు పొందడం చాలా కష్టం.ఈ సందర్భంలో, మీరు పోర్టబుల్ ఫ్రిజ్‌ని ఉపయోగించవచ్చు.

పోర్టబుల్ ఫ్రిజ్‌ని మీతో ఉంచుకోవడం ద్వారా మీరు ఏ కారులోనైనా ప్రయాణించవచ్చు.ఫలితంగా మీరు చల్లని నీటిని తాగవచ్చు.

ఈ ఫ్రిడ్జిని కారులో సులభంగా అమర్చుకోవచ్చు.మీరు ఈ స్మార్ట్ కప్ మినీ కార్ ఫ్రిజ్‌ని రూ.1,500 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

దీని సాయంతో పానీయాన్ని చల్లగా లేదా వేడిగా చేయవచ్చు.

ఇది 500ml వరకు సామర్ధ్యం కలిగి ఉంటుంది.అంటే ఇది మీ కోసం స్మార్ట్ కార్ యాక్సెసరీస్ లాగా పని చేస్తుంది.

ఇది పానీయాలను తక్షణమే చల్లబరుస్తుంది లేదా వేడి చేస్తుంది.మీరు ఇ-కామర్స్ సైట్ అమెజాన్ నుండి Hoox స్మార్ట్ కప్ మినీ కార్ రిఫ్రిజిరేటర్/ఫ్రిడ్జ్ మరియు హీటర్‌లను కొనుగోలు చేయవచ్చు.అమెజాన్‌లో కంపెనీ దీని ధరను రూ.1,499గా నిర్ణయించింది.ఇది మీ కారు నుండి 12V శక్తిని వినియోగిస్తుంది.కారులో సులభంగా సెట్ చేయడం ద్వారా, మీరు దానితో శీతల పానీయం లేదా వాటర్ బాటిల్‌ను చల్లబరచవచ్చు.

ఇది పానీయాన్ని 5 డిగ్రీల వరకు చల్లబరుస్తుందని కంపెనీ పేర్కొంది.దీని పరిమాణం 6 x 6 x 14 సెం.మీ.ఇది యూనివర్సల్ డిజైన్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది.దీని కారణంగా, దీనిని ఏ కారులోనైనా అమర్చుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube