కృష్ణాజిల్లా మచిలీపట్నం: జిల్లాల విభజన నేపథ్యంలో కృష్ణా జిల్లా నుండి విడిపోతున్న నూజివీడు, నందిగామ సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పాల్గొన్నారు.సుదీర్ఘకాలం పాటు కృష్ణా జిల్లాకు నాది గా వ్యవహరిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ వెన్నుదన్నుగా నిలుస్తూ కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో అంతర్భాగంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అభినందనలు తెలుపుతూ 15 మంది సిబ్బందికి దుశ్శాలువతో మరియు మెమొంటో అందించి సత్కరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పోలీసు సేవలను ప్రతి మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు చేరువ చేస్తూ ఆపదలో ఉన్న మహిళల రక్షణకు మేమున్నామని భరోసా కల్పిస్తూ మహిళా సమస్యల పరిష్కారానికి సచివాలయ మహిళా పోలీసులు నిరంతరమైన సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసుల దర్యాప్తు పోలీస్స్టేషన్ నిర్వహణ తదితర అంశాలతో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి పోలీస్ అధికారులు డీఎస్పీలు,సి ఐ లు ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.