బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఓంకార్ సందడి..!

బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షో అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోయినా షో మీద ఆసక్తి పెంచేందుకు బిగ్ బాస్ టీం కృషి చేస్తుంది.ప్రతి వీకెండ్ కి ముందురోజు ఎవరో ఒక సెలబ్రిటీని హౌజ్ లోకి పంపించి ఆడియెన్స్ కి ఎంటర్టైన్ అందించే ఏర్పాటు చేస్తున్నారు.

 Omkar In Biggboss House Biggboss Nonstop Details, Omkar, Bigg Boss Nonstop, Naga-TeluguStop.com

ఈమధ్యనే స్టాండప్ రాహుల్ హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ హౌజ్ లోకి వెళ్లి సందడి చేయగా లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఫస్ట్ టైం వెళ్లాడు స్టార్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరక్టర్ ఓంకార్.

స్టార్ మాలో తను చేస్తున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓంకార్ హౌజ్ లోకి వచ్చి హంగామా చేశారు.

తన షో కాన్సెప్ట్ లానే హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ ని జోడీలుగా చేసి టాస్క్ చేయమన్నారు.అంతేకాదు తన తరపున హౌజ్ మెట్స్ అందరికి సర్ ప్రైజ్ గిఫ్టులు కూడా ఇచ్చాడు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఓంకార్ ఎపిసోడ్ ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్ అందించిందని చెప్పొచ్చు.హోస్ట్ గా షో ఎలా నడిపించాలో ఐడియా ఉన్న ఓంకార్ శనివారం ఎపిసోడ్ హైలెట్ అయ్యేలా చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube