సూర్యాపేట జిల్లా:ఓటమికి కృంగిపోవడం,విజయాలకు పొంగిపోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉండదని మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు,టీపీసీసీ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాతూ 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు.తాను పార్టీలో కార్యకర్తనని,తన కార్యకర్తలకు లీడర్ నని,అధిష్టానం అదేశిస్తే,సీనియర్ నాయకులు,మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి నిర్ణయిస్తే పోటీ చేసేందుకు తాను రెఢీగా ఉన్నానన్నారు.జిల్లాలో సీనియర్ నాయకుల సలహాలతో వారి అడుగుజాడల్లో ముందుకు సాగుతానన్నారు.5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని,కార్యకర్తలు ధైర్యంగా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యకర్తలకు అండగా సీనియర్ నేతలున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.