మార్చి 7 నాటికి 380 బిలియన్ డాలర్లకు చేరిన భారత ఎగుమతులు: పీయూష్ గోయల్

ఈ ఆర్ధిక సంవత్సరంలో మార్చి 7 వరకు మనదేశ సరుకుల ఎగుమతులు 380 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి  పీయూష్ గోయల్ తెలిపారు.భారత్- కెనడా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం అధికారికంగా తిరిగి చర్చలను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

 Exports Cross $380 Billion This Fiscal So Far; Likely To Hit $410 Billion In Fy2-TeluguStop.com

దీనిని సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందంగా (సీఈపీఏ) పిలుస్తారు.

కెనడియన్ పరిశ్రమల శాఖ మంత్రి మేరీ ఎన్‌జీ గౌరవార్థం శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ విందులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ.

భారత ఎగుమతులు 380 బిలియన్లకు పైగా చేరుకున్నాయని చెప్పారు.ఇక భారత్- కెనడా సంబంధాల గురించి మాట్లాడుతూ.ఆర్ధిక సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి… అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి, అంతర్జాతీయ ఫోరమ్‌లలో ఒకరితో ఒకరు పనిచేయడానికి సహాయ పడుతుంది.

కెనడాలో 7,00,000 మంది ఇండో కెనడియన్‌లు వున్నారని.భవిష్యత్‌లో వీరి సంఖ్య 1.4 మిలియన్లకు చేరుకుంటుందని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతుండగా కెనడా పరిశ్రమల మంత్రిని ‘‘కొంచెం ఉదారం’’గా వుండాలని పీయూష్ కోరారు.

మౌలిక సదుపాయాలు, తయారీ వంటి రంగాలలో కెనడా నుంచి పెట్టుబడులు ఆశిస్తున్నట్లు పీయూష్ చెప్పారు.

కెనడా పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ.

భారత్‌లో వ్యాపారాలకు భారీ అవకాశాలున్నాయని చెప్పారు.కెనడియన్ వ్యాపార సంస్థలు భారతదేశంలో సుమారు 65 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయని తెలిపారు.

కెనడా సైతం భారత్‌తో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం, రక్షణ ఒప్పందాన్ని  (ఎఫ్ఐపీఏ) కొనసాగిస్తోందని మేరీ ఎన్‌జీ చెప్పారు.

Telugu Canada, Crossfiscal, Fipa, Mary, Canadian, Piyush Goyal, Ukraine-Telugu N

ఇకపోతే.ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ శాంతికి ముప్పు అన్న ఆమె.ఈ సైనిక చర్యను కెనడా ఖండిస్తున్నామన్నారు.కెనడాలో చాలా శక్తివంతమైన ఉక్రెనియన్ కమ్యూనిటీ వుందని మేరీ అన్నారు.అందువల్ల ప్రస్తుత సంఘటనలతో వారంతా ఆందోళనకు గురవుతున్నారని ఆమె చెప్పారు.మిత్రదేశాలతో పాటు నిరంకుశత్వానికి వ్యతిరేకంగానూ, భవిష్యత్‌లోనూ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తుందని మేరీ పేర్కొన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు రాజకీయ ప్రతిస్పందనే కాదు, ఆర్ధిక ప్రతిస్పందన కూడా అవసరమేనన్నారు.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మిలియన్లకు పైగా భారతీయ విద్యార్ధులు వున్నారని ఆయన అన్నారు.

ఇందులో కెనడా ఒకటి అని ఎస్ జైశంకర్ చెప్పారు.రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు వ్యాపారం దోహదపడుతుందని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube