దంతాలు తళతళా మెరుస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కానీ, కొందరి దంతాలు తెల్లగా కాకుండా పసుపు రంగులో గారపట్టేసి ఉంటాయి.
ఎన్ని టూస్ట్ పేస్ట్‌లను మార్చినా ఫలితం ఉండదు.ఇలాంటి వారు నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే గనుక దంతాలు ఎంత పసుపు రంగులో ఉన్నా తళతళా మిలమిలా మెరవడం ఖాయం.మరి ఇంకెందుకు లేటు ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా చిన్న అల్లం ముక్క తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.అలాగే ఒక నిమ్మ పండు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో అల్లం తురుము, నిమ్మ పండు ముక్కలు, ఐదు లవంగాలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించి వాటర్‌ను మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత చిన్న గిన్నె తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి, వన్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ వేసి కలపాలి.చివర్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టూత్ బ్రెష్ సాయంతో దంతాలకు అప్లై చేసి రెండంటే రెండు నిమిషాల పాటు స్మూత్‌గా తోముకోవాలి.
ఆపై నార్మల్ వాటర్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక పసుపు పట్టిన దంతాలు తెల్లగా మారి తళతళా మెరుస్తాయి.కాబట్టి, ఎవరైతే పసుపు దంతాలతో తీవ్రంగా సతమతం అవుతున్నారో.
వారు ఖచ్చితంగా పైన చెప్పిన చిట్కాను ప్రయత్నించండి.