చిరంజీవి 'ఆచార్య' సినిమాకు ఏపీలో అదనపు షో ల విషయం ఏంటీ కథ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లను పెంచుతూ కొత్త జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే.టిక్కెట్ల రేట్లపై తో పాటు అదనపు షో ల విషయంలో కూడా కొత్త జీవో లో క్లారిటీ ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్లో కనీసం 20 శాతం షూటింగ్ జరుపుకోవడంతో పాటు 100 కోట్ల కు మించి బడ్జెట్ అయినా సినిమాలకు అదనపు షో లకు అనుమతిస్తామని ప్రకటించారు.100 కోట్ల బడ్జెట్ లో హీరో హీరోయిన్ దర్శకుల పారితోషకం తీసేయాల్సి ఉంటుంది.అంటే కేవలం మేకింగ్ విలువ రూ.100 కోట్లు కావాలన్నమాట.ప్రభాస్ రాధేశ్యామ్ మరియు జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరగకుండా కూడా వాటికి అదనపు షో లకు అనుమతిస్తున్నట్లుగా మంత్రి స్పెషల్ ప్రకటన చేయడం జరిగింది.

 Is Chiranjeevi Acharya Movie Get Special Show Permeation For 5th Show , Achary-TeluguStop.com
Telugu Acharya, Ap, Chiranjeevi, Radheshyam, Show, Ys Jagan-Movie

టికెట్ల రేట్ల పెంపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసినా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎందుకంటే ఆచార్య సినిమా మేకింగ్ కోసం 100 కోట్లు ఖర్చు చేయలేదు, అలాగే 20 శాతం షూటింగ్‌ ను ఏపీ లో చేయలేదు .కనుక ఆచార్య సినిమా కు ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ జగన్ ప్రభుత్వం తో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా అదనపు షో కి అవకాశం ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.చిరంజీవి పట్ల చాలా పాజిటివ్ సీఎం సీఎం జగన్ మరియు మంత్రి పేర్ని నాని ఉన్నారు.

కనుక ఆచార్య సినిమాకి పర్మీషన్‌ దక్కే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ని ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే.

కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంగీత కీలక పాత్రలో నటించింది.రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ లు సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

కొరటాల శివ దర్శకత్వం రూపొందిన ఈ సినిమా రెండేళ్ల క్రితం రావాల్సినా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube