చిట్టి చేతులతో పెద్ద అద్భుతాన్ని సృష్టించిన 12 ఏళ్ల బాలుడు..!

టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదని ఈ 12 ఏళ్ల బాలుడు నిరూపించి చూపించాడు.అద్భుతాలు సృష్టించాలంటే వయసుతో పని లేదని హర్సిర్జన్ అనే బాలుడు అంటున్నాడు.

 12 Years Boy Builds Robo Got Placed In India Book Of Records Details, Robo, Vira-TeluguStop.com

ఆటలాడుకునే వయసులో ఎంతో గొప్పగా అలోచించి ఓ రోబోను తయారు చేసి ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.వివరాల్లోకి వెళితే.

పంజాబ్‌ లోని లూథియానాకు చెందిన 12 ఏళ్ల హర్సిర్జన్ అనే బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు.అయితే హర్సిర్జన్ కు చిన్నప్పట్నుంచే ఏదోటి సాదించాలనే పట్టుదలతో ఉండేవాడు.

ఈ క్రమంలోనే చిన్న వయసు నుంచి రోబోటిక్స్‌ పై అమిత ఆసక్తి పెంచుకున్నాడు.బాలుడు తల్లి తండ్రులు కూడా హర్సిర్జన్ యొక్క ఆసక్తిని గమనించి అతన్ని ప్రోత్సహించారు.

అలా హర్సిర్జన్ చిన్నావయసు నుంచే రోబోటిక్స్ టెక్నాలజీలో శిక్షణ పొందుతూ వచ్చాడు.అలా పాఠశాలలో ఇచ్చిన ప్రాజెక్టులో భాగంగా ఆల్ట్రా వైలెట్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబోను తయారు చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ 12 ఏళ్ల హర్సిర్జన్.

తన చిట్టి చేతులతో ఏకంగా రోబోను తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నాడు.ఈ బాలుడు తయారుచేసిన రోబో ఆషామాషి రోబో కాదండోయ్.చాలా ప్రత్యేకమైనది.ఎందుకంటే ఇది ఆల్ట్రా వైలెట్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో అన్నమాట.

అంటే వాతావరణంలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుందని హర్సిర్జన్ చెబుతున్నాడు.అలాగే ఈ రోబోకి యూవీ-21 అనే పేరు పుట్టినట్లు హర్సిర్జన్ చెప్పాడు.

ఈ రోబో 360డిగ్రీల కోణంలో పనిచేసే ఒక కెమెరాను కలిగి ఉంటుంది.

Telugu Boy, Builds Robo, Harsirjan, India, Ludhiana, Robo, Latest-Latest News -

ఈ రోబోను మెుబైల్ వై-ఫై సాయంతో నియంత్రించవచ్చట.కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ రోబో తయారు చేసాడు హర్సిర్జన్‌.ఎందుకంటే ఈ రోబో విడుదల చేసే అతినీలలోహిత కిరణాల వల్ల వాతావరణంలోని బ్యాక్టీరియా చనిపోయెలా ఈ రోబోను హర్సిర్జన్‌ రూపొందించాడు.

బ్యాటరీల ఆధారంగా పనిచేసే యూవీ-21 రోబోను ఆస్పత్రులలో, ఇళ్లలో ఉపయోగించవచ్చు.ఈ రోబోను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని 1.5 మీటర్ల చుట్టు వరకు ఇది ప్రభావం చూపుతుందని హర్సిర్జన్‌ తెలిపాడు.ఈ రోబో తయారుచేయడానికి గాను అతనికి 15000 ఖర్చయినట్లు చెప్పాడు.

హర్సిర్జన్ తయారుచేసిన రోబోకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కడం విశేషం.ప్రస్తుతం పేటెంట్ హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

అవి వచ్చిన తరువాత ఈ రోబోను మరింత క్షుణ్ణంగా పరీక్షించి అప్పుడు తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తానని 12 ఏళ్ల హర్సిర్జన్ అంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube