ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలి.

నల్లగొండ జిల్లా:ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలంటూ సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ, పి.డి.

 Russia Must Stop War On Ukraine.-TeluguStop.com

ఎస్.యూ,పి.వై.ఎల్ సంఘాల ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి రష్యన్,నాటో,అమెరికా సామ్రాజ్యవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్ లు మాట్లాడుతూ ఉక్రెయిన్ పై రష్యా దేశం చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.యుద్ధం అంటేనే విధ్వంసమని,చిన్న పిల్లలతో సహా అనేకమంది మరణించడం బాధాకరమన్నారు.

రష్యా దేశం చేస్తున్న యుద్ధాన్ని,నాటో కూటమి కొనసాగిస్తున్న యుద్ధోన్మాద చర్యలను తీవ్రంగా ఖండించారు.ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని సూచించారు.

జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ లో ఉన్న సాధారణ ప్రజలు అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు.యుద్ధాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయన్నారు.

యుద్ధం ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజానీకానికి మనుగడ కష్టం అవుతుందన్నారు.సామ్రాజ్యవాద శక్తులు మధ్య ఆధిపత్యం ఘర్షణ యుద్ధానికి దారి తీసిందన్నారు.

భారతదేశ ప్రధాని, ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను యుద్ధ ప్రాతిపదికన మన దేశాలకు రప్పించాలన్నారు.లేదంటే నవీన్ లాంటి అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

యుద్ధాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (యం.యల్) న్యూడెమోక్రసీ,పి.డి.ఎస్.యూ, పి.వై.యల్ నాయకులు బి.వి చారి,పి డీ ఎస్ యూ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నూనె సురేష్,ఏర్పుల యాదయ్య,రమావత్ రవి,రవీందర్,క్రాంతి,సుధాకర్,రాజు, వెంకటేశ్వర్లు,రంజిత్,ఎం.డి.ఉమర్,నేహల్,జుబేర్,ప్రశాంత్,శివ, అనిల్,వరప్రసాద్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube