గూగుల్ పేలో ఒక లక్షల రూపాయల రుణం... ఎలా అప్లయ్ చేయాలంటే..

గూగుల్ పేలో రూ.1 లక్ష వరకు తక్షణ రుణం తీసుకోవచ్చని మీకు తెలుసా? గూగుల్ పే అందిస్తున్న ఈ నూతన సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొన్నిసార్లు మనకు అత్యవసరంగా డబ్బు అవసరం ఏర్పడుతుంది.అటువంటి సందర్భాల్లో మన బ్యాంకుల నుండి చాలా ఎక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటాం.ఇటువంటి పరిస్థితిలో మీరు వెంటనే రూ. 1 లక్ష వరకు రుణం పొందే కొత్త పద్ధతిని గూగుల్ పే తీసుకొచ్చింది.మీకు ఇప్పటికే గూగుల్ పే గురించి తెలిసే ఉంటుంది.దీని నుండి మీరు ఇప్పుడు రూ.1 లక్ష వరకు వ్యక్తిగత రుణాన్ని పొందే అవకాశం ఉంది.

 Google Pay Loan Up To 1 Lakh Rupees , Google Pay , Google Pay Loan , Banks ,-TeluguStop.com

కొత్త ఫీచర్ ఏమిటి? ఇటీవలే గూగుల్ పే డీఎంఐ ఫైనాన్స్ లిమిటెడ్‌తో జతకట్టింది.ఈ భాగస్వామ్యంతో రెండు కంపెనీలు కలిసి డిజిటల్ పర్సనల్ లోన్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి.

Telugu Rupees, Banks, Personal Loan, Dmi, Google Pay, Google Pay Loan, Loan-Late

తిరిగి చెల్లించడం ఎలా? మీరు గూగుల్ పే ద్వారా డిజిటల్‌ రూపంలో రూ.1 లక్ష వరకు వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు.ఈ మొత్తాన్ని 36 నెలలు లేదా గరిష్టంగా 3 సంవత్సరాల వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు.

ప్రస్తుతం డీఎంఐ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గూగుల్ పే దేశంలోని 15,000 పిన్ కోడ్‌లలో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది.

షరతులు ఏమిటి? ఈ లోన్ తీసుకోవడానికి రుణ గ్రహీత గూగుల్ పేలో కస్టమర్‌ అయి ఉండాలి.కొత్తగా ఖాతాను ప్రారంభించివుండకూడదు.అయితే క్రెడిట్ హిస్టరీ బాగుండాలి.అప్పుడు మాత్రమే ఈ లోన్ అందుకోవచ్చు.ప్రతి వ్యక్తి ఈ రుణాన్ని తీసుకోలేడు.

మంచి క్రెడిట్ హిస్టరీ కలిగినవారికే రుణం మంజూరవుతుంది.ప్రీ-క్వాలిఫైడ్ అర్హత కలిగిన వినియోగదారులు డీఎంఐ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఈ రుణం తీసుకోవచ్చు.

ఈ లోన్ గూగుల్ పే ద్వారా అందుకుంటారు.ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్‌ర్ల లోన్ అప్లికేషన్ రియల్ టైమ్‌లో ప్రాసెస్ అవుతుంది.నిర్ణీత సమయం తర్వాత మీ ఖాతాలోకి రూ.1 లక్ష వరకు రుణం జమ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube