విలాస‌వంతం కాద‌ని స్కూల్ బ‌స్‌లోనే మ‌కాం...! ఇది చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!

స‌మాజంలో ఎవ‌రైనా విలాస‌వంత‌మైన జీవితం గ‌డ‌పాల‌ని అనుకుంటారు.ఇల్లు, డ‌బ్బు, స్థ‌లం .

 Stay In The School Bus That Is Not Luxurious  You Will Be Shocked If You See It-TeluguStop.com

ఇలా ఏదైనా ఎవ‌రి ఆశ‌లు, క‌ల‌లు వారికి ఉంటాయి.ఇందులో ఇల్లు అనేది అంద‌రిక అవ‌స‌ర‌మే.

అందుకే జీవితంలో ఇల్లు క‌ట్టి చూడు… అంటుంటారు.అంత‌లా వ్య‌య‌ప్ర‌యాస‌లు ప‌డితే త‌ప్ప ఇల్లు క‌ల నెర‌వేర‌దు.

కానీ, కొంద‌రు కొత్త‌గా ఆలోచిస్తూ ప‌లు ర‌కాల వాటిన ఇల్లుగా వాడుకుంటుంటారు.ఈవీడియోలో మాత్రం వారు ఇల్లు కోసం ఏం చేశారో తెలిస్తే వావ్ అంటారు.

వారు ఓ వాహ‌నాన్ని ఇంటిగా మార్చుకుని అందులోనే ఉంటున్నారు.ఇంత‌కు ఏం చేశారో తెలుసుకోవాల‌నుందా.? అయితే మీరు ఇది చ‌ద‌వాల్సిందే.

డిసెంబ‌ర్ 2020లో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కేటీ, సామ్‌లు ఒక స్కూల్ వ్యాన్ కొన్నారు.

అప్ప‌టి నుంచి వారు నివాసం ఉంటున్న విలాస‌వంత‌మైన 3బీహెచ్‌కే ఫ్లాట్‌ను వ‌దిలేశారు.స్కూల్ వ్యాన్‌లో నే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.ఇంత‌లా ఆ స్కూన్ వ్యాన్ ఎందుకు ఆక‌ర్షించేలా ఏముంద‌ని ముక్కున వేలేసుకోక మాన‌రు.ఎందుకంటే సాదాసీదా వ్య‌న్ కాదండి.

దాని లోప‌ల ఏమేమి ఉన్నాయో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.అంత‌లా దానిని డెక‌రేట్ చేశారు.

స్కూల్ బ‌స్సును ఏకంగా ఇంటీరియ‌ర్ డిజైన్‌తో ఇంటిలా మార్చేశారు.ఇందుకు ఏడాదికి పైగా స‌మ‌యం తీసుకుని చాలా అద్భ‌తంగా తీర్చిదిద్దారు.

అందులో ఏమేమి ఉన్నాయంటే.

స్కూల్ బ‌స్సులో ఒక ప‌డ‌క గది, వంట‌గ‌ది, బాత్రూమ్‌, డైనింగ్ రూమ్ ఉన్నాయి.

బాత్రూమ్, డైనింగ్ రూమ్ ఇవ‌న్నీ వారు స్వేచ్ఛా జీవితాన్ని గ‌డ‌ప‌డానికి వారికి న‌చ్చిన‌ట్టు మార్చుకోవ‌డం విశేషం.ఇందులో నివాసం ఉండ‌డ‌మే కాదు… త‌ర‌చూ టూర్‌ల‌కు వెళ్తుంటారు కూడా.

అయితే ఓ ప‌త్రిక‌లో వారి గురించి ప్ర‌చురించిన వార్త ప్ర‌కారం… ఈ జంట గ‌తంలో చార్లెస్‌లో 3బీహెచ్‌కే విలాస‌వంత‌మైన ఫ్లాట్లో అద్దెకు ఉన్నారు.అనంత‌రం సీయాట‌ల్‌లోని 2బీహెచ్‌కేలోకి మారారు.

ఆ త‌రువాతే సెయింట్‌ పీట్‌లో ఈ స్కూల్ బ‌స్సును కొన్నారు.అనంత‌రం వారికి న‌చ్చిన విధంగా ఇంటిగామార్చుకుని జీవ‌నం సాగిస్తుండ‌డం విశేషం.

ఇది విన్న వారంతా నోరెల్ల‌బెట్టాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube