జీ`5 ఓటీటీలో 500 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో 'బంగార్రాజు' విజయ విహారం...

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది.అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది.

 Nagarjuna Bangarraju Movie 500 Million Minutes Views In Zee5 Details, Nagarjuna,-TeluguStop.com

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు` సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’… అనేది ఉపశీర్షిక.అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.

లి.,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.క‌ళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు.సంక్రాంతికి థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది.

ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18 నుంచి ‘జీ 5’ లో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.జీ5 లో ప్రసారమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ విడుదలైన 7 రోజుల్లో 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని సామాజిక మీడియా ట్విట్టర్ ద్వారా అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నటుడు, నిర్మాత కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.కోవిడ్ టైం లో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇవ్వడం జరిగింది.అయితే మా “సోగ్గాడే చిన్నినాయన” సినిమాను గతంలో కూడా సంక్రాంతి కి రిలీజ్ చేయడం జరిగింది.ఆ సెంటిమెంట్ తో కోవిడ్ ఉన్న కూడా మేము ఎంతో ధైర్యం చేసి ఈ సంక్రాంతి కి మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది.

అయితే ప్రేక్షకులనుండి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ‘జీ 5’లో విడుదల చేయడం జరిగింది.జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైన కేవలం 7 రోజుల్లో 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవ్వడం ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక సరికొత్త రికార్డ్.ఈ సందర్భంగా బంగార్రాజు ను ఆదరించిన, ఆదరిస్తున్న, ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ మా టీం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నారు.

Nagarjuna Bangarraju Movie Million Minutes Views In Zee5 Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube