నేను ఇంకా అక్కడే ఆగిపోయా.. సురేఖా వాణి కూతురు సుప్రిత పోస్ట్ వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తల్లి, పిన్ని, వదిన పాత్రలో నటిస్తూ ఎంతగానో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Im Still Stuck There Surekha Vani Daughter Supritha Post Viral , Surekha Vani ,-TeluguStop.com

ఈ విధంగా వెండితెరపై తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.కరోనా లాక్ డౌన్ సమయంలో సురేఖ వాణి తన కూతురు సుప్రీతను తన అభిమానులకు పరిచయం చేశారు.

ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి గ్లామరస్ దుస్తులు ధరించి సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్లను షేర్ చేయడం లేదంటే ఎన్నో పాటలకు డాన్స్ వీడియో లు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుని సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సురేఖ తన కూతురు సుప్రీత కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

ఇక సుప్రీత విషయానికి వస్తే ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోని తన ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటారు.ఇకపోతే వీరిద్దరూ చేసే డాన్స్ పర్ఫార్మెన్స్ ల గురించి కొన్ని సార్లు నెటిజన్ల నుంచి దారుణమైన కామెంట్లను కూడా ఎదుర్కొంటారు.అయినా వీటన్నింటినీ పట్టించుకోకుండా తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా అభిమానులను సందడి చేసే సుప్రీత ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే సుప్రీత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ.నేను వేరే వారి స్టోరీ చూసి ఫిబ్రవరి నెల పూర్తి కావస్తుందని రియలైజ్ అయ్యాను.కానీ నేను ఇంకా 2020 సంవత్సరంలోనే ఉండిపోయాను అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సుప్రీత కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నారు.

తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తానని సురేఖవాణి చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube