మరోసారి అల్లుడి కోసం వచ్చిన మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ మనవడు.సూపర్ స్టార్ మహేష్ బాబుకు మేనల్లుడు అయినా అశోక్ గల్లా నటించిన హీరో సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 Mahesh Babu Video Bite For Ashok Galla Hero Movie Ott Release ,  Film News ,  Ga-TeluguStop.com

ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.వసూళ్లు యావరేజ్ గా వచ్చినట్లుగా సమాచారం.

ఇక హీరో సినిమా ను డిజిటల్ ప్లాట్ ఫారం పై స్ట్రీమింగ్ కి సిద్ధం చేశారు.ప్రముఖ ఓటీటీ సంస్థ అయినా డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ వారు ఈ సినిమా ను కొనుగోలు చేశారు.

సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో అవ్వడం వల్ల భారీ మొత్తంలో ఈ సినిమాను ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఓటీటీ లో సినిమా ను స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కూడా హడావుడి చేస్తున్నారు.

అంటే పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అందులో బాగంగానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా ప్రమోషన్ ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ నెల 11 వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్న హీరో సినిమా కోసం ఏకంగా వారు మహేష్ బాబు ని రంగంలోకి దించారు.షూటింగ్ లతో బిజీగా ఉన్న మహేష్ బాబు తో ఈ సినిమా కోసం వీడియో బైట్ ఇప్పించారు.దాంతో ఈ సినిమా కు మంచి హైప్ క్రియేట్ అయింది అంటూ నెట్ లో కామెంట్ చేస్తున్నారు.ఈ సినిమాను చూడాలనే ఉద్దేశం ప్రేక్షకుల్లో కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు రాష్ట్రా లో మంచి ఫాలోయింగ్ ని కలిగి ఉంది.కనుక ఈ సినిమా ను ఎక్కువ శాతం మంది చూసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో గల్లా అశోక్ జోడిగా నిధి అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే.ఈ అమ్మడు ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు జోడిగా హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.

ఆ కారణంగా కూడా ఈ సినిమాకు మంచి అంచనాలు ఉన్నాయి.మరి థియేటర్లో ఆకట్టుకోలేక పోయినా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫారం మీద ఏ స్థాయిలో మెప్పిస్తుంది అనేది చూడాలి.

ఈ సినిమాకు మహేష్ బాబు ప్రమోషన్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి.

Mahesh Babu Video Bite For Ashok Galla Hero Movie Ott Release , Film News , Galla Ashok , Hero Movie , Mahesh Babu , Movie News , Streaming On A Digital Platform , Disney Plus Hot Star - Telugu Disney Hot, Galla Ashok, Mahesh Babu, Nidhi Agarwal, Platm

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube