పెండ్లి అంటేనే సరదాలు, ఆట పట్టించడాలు చాలా కామన్.ఎందుకంటే ఒకప్పటి లాగా ఏదో జరిగిందా అంటే జరిగింది అన్నట్టు చేసుకోవడం లేదు కదా ఇప్పటి యూత్.
అందుకే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.ఒకప్పటి లాగా పెండ్లి అంటే కొన్ని మత్రమే చేయాలి అన్నట్టు కాకుండా.
చాలా వెరైటీ పనులు ఉండేలా చూసుకుంటున్నారు.డ్యాన్సులు, వెరైటీ వంటకాలు, ఆటలు ఇలా ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు.
మొన్నటికి మొన్న ఓ పెండ్లిలో పంతులే దగ్గరుండి మరీ వధూవరులతో కుర్చీలాట ఆడించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.
పెండ్లి అంటేనే డ్యాన్స్ అన్నట్టు ఈ నడుమ ఎంతలా డ్యాన్స్ వీడియోలు పాపులర్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి బాగా పాపులర్ అవుతోంది.
ఇందులో అమ్మాయి ఏం డ్యాన్స్ చేయలేదు గానీ.పానిపూరి తిన్నది.
ఏంటి పెండ్లిలో పాని పూరి తిన్నదా అని ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే.అయితే ఇందుకు దగ్గరుండి కాబోయే భర్త సాయం చేయడం ఇంకా వివేషం.
ఇప్పుడు వైరల్ అవుతున్న వైరల్ వీడియోలో ఓ చోట పెండ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరగడం మనకు కనిపిస్తుంది.అయితే ఈ వైరల్ పెండ్లిలో వధువు ఆనందగా పానీపూరి తినాలనుకుంది.ఇంకేముంది అనుకున్నట్టుగానే పానిఫూరిని తెప్పించుకుంది.కాగా ఆమె తినే సమయంలో తన ముక్కు పుల్ల ఆమెకు అడ్డు వస్తోంది.ఇక వెంటనే పక్కనే ఉన్న పెండ్లి కొడుకు రంగంలోకి దిగిపోయాడు.ఆమె ముక్కుపుల్ల అడ్డు రాకుండా సాయపడ్డాడు.
ఇలా కాబోయే వాడి సాయంతో ఆమె పానిపూరిని లాగించేసింది.మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి.
మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.