సరిగ్గా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు.అనంతరం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని నెరవేర్చక పోవటంతో ముద్రగడ పద్మనాభం… కాపుల హక్కుల కోసం పోరాటానికి దిగటంతో అదే సమయంలో తునిలో రైలు దహనం కావటంతో.
ముద్రగడ పద్మనాభం పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొంతమంది కాపులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది.కాగా జగన్ ప్రభుత్వం ఆ కేసులకు సంబంధించి.
అన్నిటినీ కొట్టివేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి థాంక్స్ చెబుతూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లెటర్ రాశారు.
కాపుల మీద పెట్టిన కేసులను ఎత్తివేసినట్లు మంత్రి కురసాల కన్నబాబు మెసేజ్ ద్వారా తెలియజేశారు అని లెటర్ లో పేర్కొన్నారు.తప్పుడు కేసులు బనాయించి అన్యాయంగా మమ్మల్ని ముద్దాయిలు చేసి.
అప్పట్లో దారుణంగా వ్యవహరించారు అని పేర్కొన్నారు.అయితే ఈ క్రమంలో ఆ భగవంతుడు మీ ద్వారా కేసుల నుండి తప్పించినందుకు… మోక్షం కలిగించినట్లు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
అప్పటి సీఎం చంద్రబాబు “బిసి ఎఫ్” ఫైల్ నీ కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు, ఎప్పుడు మీరు కేసులు ఎత్తి చేసినప్పుడు తానే వచ్చి ధన్యవాదాలు చెప్పాలి అనుకున్న కానీ రాలేకపోతున్నానని పేర్కొన్నారు.అందరి లాగా తాను కోటీశ్వరుడు కాదని… మీ ఇద్దరిని కలిస్తేనే జాతినీ అమ్మకం పెట్టి కోట్లు సంపాదించుకున్నట్లు… సమాజం అనుకుంటుంది అందుకే ముందుకు రాలేకపోతున్నారు స్పష్టం చేశారు.
అంతే కాకుండా కాపుల కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో తనకు ఎదురైన కష్టాలు భూతులను గుర్తుంచుకుంటే ఎవరో కూడా భవిష్యత్తులో ఉద్యమానికి ముందుకు రారు అని చెప్పుకొచ్చారు.