రాజస్థాన్ రాజకీయాల్లో ‘రీట్‘పై చర్చ.. దీని పూర్వాపరాలు తెలిస్తే..

ఇప్పుడు రాజస్థాన్‌లో సాధారణ సమస్యల కంటే ‘రీట్’ (REET 2021)పై అధికంగా చర్చ జరుగుతోంది.దీనిని ప్రభుత్వం సమర్థిస్తుండగా.

 Discussion On Reet In Rajasthan Politics Details, Politics Exams Stuednts, Raja-TeluguStop.com

ప్రతిపక్షాలు నిత్యం దాడికి దిగుతున్నాయి.సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

రీట్‌పై సీబీఐ చేత విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఇంతకీ ‘రీట్’ అంటే ఏమిటి? దీనిపై ఎందుకు ఈ స్థాయిలో వివాదం జరుగుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.’రీట్‘ అనేది రాజస్థాన్‌లో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులందరూ ’రీట్‘ పరీక్షకు హాజరు కావాలి.ఈ పరీక్షను వివిధ స్థాయిలలో నిర్వహిస్తారు.

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పరీక్ష జరిగింది.

ఈసారి 31 వేల పోస్టులకు పరీక్ష నిర్వహించారు.సుమారు 4 సంవత్సరాల తర్వాత ఈ పరీక్ష నిర్వహించారు.

ఫలితంగా అభ్యర్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది.ఈసారి పరీక్ష నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకుని, భద్రతా బలగాల సహకారంతో పరీక్ష నిర్వహించారు.

అయితే ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయని, పేపర్‌ లీక్ అయిందనే ఆరోపణలు వినిపించాయి.పరీక్ష పేపర్ లీక్ అయిందని, పలువురు ఉన్నతాధికారుల సహకారంతో కోట్లాది రూపాయల పేపర్ డీల్స్ జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈ వివాదం కోర్టుకు చేరి, దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఉదంతంలో పలువురిని అరెస్టు చేశారు.పరీక్ష నిర్వహించిన రోజున పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి.విద్యార్థులు ప్రత్యేక పరికరంతో కూడిన చెప్పులు ధరించి కనిపించారు.

పరీక్షకు రెండు రోజుల క్రితమే పరీక్ష పేపర్ లీక్ అయినట్లు విచారణలో తేలింది.జైపూర్ ఎడ్యుకేషన్ సంకుల్ స్ట్రాంగ్ రూమ్ నుండి పేపర్ లీక్ అయిందని తేలింది.

దీంతో రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఛైర్మన్ డిపి జరౌలీని తొలగించారు.పేపర్‌ను వాట్సాప్ ద్వారా షేర్ చేసి.

కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి.పేపర్ లీక్‌లో ఎవరి హస్తం ఉందో స్పష్టం కావాల్సివుంది.

పలువురు అభ్యర్థులు ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Discussion On Reet In Rajasthan Politics Details, Politics Exams Stuednts, Rajasthan Public Service Commission, Rajasthan Reet Exam, Teachers Eligibility Test, Paper Leaks, Ministers, Govt Exam, Rajasthan Govt - Telugu Exams, Exam, Ministers, Paper Leaks, Rajasthan, Rajasthanreet, Reet

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube