భారత సైన్యంలో మత గురువులు ఎందుకు ఉంటారో తెలుసా?

సైన్యంలో మత గురువులకు కీలక పాత్ర ఉంటుంది.పుణెలోని దోపోడిలో ఉన్న కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్‌లో ఆ మ‌ద్య జ‌రిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో మత గురువులు సైన్యంలోకి ప్రవేశించారు.

 Do You Know Why There Are Religious Leaders In The Indian Army People Spiritual-TeluguStop.com

ఈ 31 మంది మత గురువులు ఆధ్యాత్మికత, యోగా, మానసిక సలహాలు, ఒత్తిడి నిర్వహణ, జాతీయ సమైక్యత, ప్రవర్తన‌, సామాజిక శాస్త్రాల గురించి వివ‌రిస్తారు.ఈ మత గురువులు ‘ధర్మ యోద్ధ’గా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు.

సైనికుల మధ్య ఉన్న ఉద్రిక్తతల‌ను తగ్గించే బాధ్యత కూడా వారికి ఉంటుంది.ఈ మత గురువులు ఈ జవాన్లకు మానసికంగా సలహాలు ఇవ్వడంతోపాటు వారి మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకులుగా అదనపు బాధ్యతను నిర్వర్తిస్తారు.

సైన్యంలోని సైనికుల మనోబలాన్ని ఉన్నతంగా ఉంచడంలో మత గురువులు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారు.సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోధైర్యాన్ని ఉన్నతంగా ఉంచడం, వారిని ప్రేరేపించడం ఈ మత గురువుల బాధ్యత.

అదే సమయంలో యూనిట్లలో యుద్ధంలో విజయం సాధించే వ్యూహాలు, విలువలను కూడా తెలియ‌జెపుతారు.లౌకికవాద విలువలను పెంపొందించడం మరియు సైన్యంలో ఐక్యతను ప్రోత్సహించడం వీరి ప‌ని.

ఈ పాత్రలో సైన్యానికి సహాయం చేయడానికి వీరు నియ‌మితుల‌వుతారు.వీరి లక్ష్యం జాతీయ సమగ్రత, దేశ నిర్మాణం.

ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ ఆలోచనను అనుసరించి 1980లో ఈ సంస్థ ఐఎన్ఐకి రూప‌క‌ల్ప‌న జ‌రిగింది.తొలుత దీనిని పైలట్ ప్రాజెక్టుగా సైన్యం ముందుకు తీసుకెళ్లారు.

Do You Know Why There Are Religious Leaders In The Indian Army People Spiritual Lessons, Army People, Religious Leaders , Prime Minister, Army Chief, College Of Military Engineering, Dopodi, Pune - Telugu Military, Dopodi, Indian, Prime, Psychological, Pune, Spiritual, Stress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube