అమెరికా : కాలేజీలో రెచ్చిపోయిన ఉన్మాది.. కాల్పులతో వీరంగం, ఇద్దరు పోలీసుల మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.వర్జీనియా రాష్ట్రం బ్రిడ్జ్‌వాట‌ర్ కాలేజీలో ఓ ఉన్మాది ఇద్ద‌రిని కాల్చి చంపాడు.

 Us  2 Campus Police Officers Killed In Virginia College , State Of Virginia, Bri-TeluguStop.com

మృతులను కాలేజీలో సెక్యూరిటీ ఆఫీస‌ర్లుగా పనిచేస్తున్న జాన్ పెయింట‌ర్‌, క్యాంప‌స్ సేఫ్టీ ఆఫీస‌ర్ జేజే జెఫ‌ర్స‌న్‌గా గుర్తించారు.కాల్పులు జ‌రిపిన నిందితుడిని 27 ఏళ్ల అలెగ్జాండ‌ర్ వాయ‌త్ క్యాంప్‌బెల్‌గా అనుమానిస్తున్నారు.

ప్ర‌స్తుతం అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రాకింగ్‌హామ్ కౌంటీ జైలుకు తరలించారు.ఆ ఆర్ట్స్ కాలేజీలో దాదాపు 1800 మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు.

అయితే కాల్పులకు దారి తీసిన కారణాలు, క్షతగాత్రుల వివరాలు మాత్రం తెలియరాలేదు.

ఈ ఘటనపై స్కూల్ ప్రెసిడెంట్ డేవిడ్ డబ్ల్యూ.

బుష్‌మన్ స్పందిస్తూ.ఇద్దరు సెక్యూరిటీ అధికారులను కోల్పోవడం తమను శోకసంద్రంలో ముంచిందని అన్నారు.

ఈ బాధను తెలియజేయడానికి పదాలు రావడం లేదని బుష్‌మన్ ఆవేదన వ్యక్తం చేశారు.అటు ఈ కాల్పుల ఘటనపై వర్జీనియా గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరణించిన పోలీసు అధికారులకు సంతాపంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనతనం చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు.ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారి కుటుంబం, సన్నిహితులకు అండగా వుంటామని యంగ్‌కిన్ అన్నారు.

బ్రిడ్జ్‌వాటర్ కాలేజ్ అనేది రిచ్‌మండ్‌కు వాయువ్యంగా 125 మైళ్ల (200 కిలోమీటర్లు) దూరంలో వున్న ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ కళాశాల.ఇది చారిత్రాత్మకంగా చర్చ్ ఆఫ్ బ్రదర్న్‌తో అనుబంధం కలిగి వుంది.

గత నెలలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ ఏంజెల్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడిన ఘటనలో నలుగురు మరణించగా.మరొకరు గాయపడ్డారు.లాస్‌ ఏంజెల్స్‌కు సమీపంలో ఉన్న ఇంగ్లెవుడ్‌లోని ఓ ఇంట్లో పార్టీ జరుగుతోంది.అరుపులు, కేకలతో అంతా పార్టీని గడుపుతున్నారు.అందరూ మంచి మూడ్‌లో వుండగా ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆ ఇంటిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

US 2 Campus Police Officers Killed In Virginia College , State Of Virginia, Bridgewater College, Campus Safety Officer JJ Jefferson, School President David W, Governor Glenn Youngkin, California, Church Of The Brotherhood - Telugu Bridgewater, Calinia, Campussafety, Governorglenn, School David, Virginia, Campusofficers

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube