తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. కానీ వీరికి మాత్రం తగ్గదు..!

ఒకటో తారీఖు వస్తే చాలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి.

 Reduced Gas Cylinder Price But Not For Them , Gas Cylinder, Price Decrease, Late-TeluguStop.com

అందుకే ఒకటో తారీఖు వస్తే చాలు అందరు గ్యాస్ ధర తగ్గుతుందో లేక పెరుగుతుందో అనే భయంతో వణికిపోతున్నారు.కానీ ఈసారి గ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త.

గ్యాస్ సిలిండర్ ధరలు దిగివచ్చాయి.ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం జరిగింది.

అయితే ఇది అందరి వినియోగదారులకు వర్తించదు.కేవలం కొంత మంది గ్యాస్ వినియోగదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది.ఎందుకంటే కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే తగ్గించడం వలన కేవలం వారికి మాత్రమె తగ్గింపు ధర వర్తిస్తుంది.కాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కేజీల సిలిండర్ ధరల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతుంది.

ఇలా తగ్గించిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయని ఆయా కంపెనీలు తెలిపాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.91.5 మేరకు తగ్గడం విశేషం అనే చెప్పాలి.గత నెలలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 102.5 తగ్గింది.అంటే వరుసగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది రెండవసారి అన్నమాట.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, అలాగే అమెరికా డాలర్‌ తో ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి పలు అంశాలు సిలిండర్ ధర విషయంలో ప్రభావితం చూపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube