గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.సొంత పార్టీలోనే ఉంటూ అసమ్మతి తో రగిలిపోతున్న నాయకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో ఆయన ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.
దీనిలో భాగంగానే టిఆర్ఎస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ విషయంలో ఇప్పటివరకు నాన్చుడు ధోరణి తో వ్యవహరించినా, ఇకపై ఆయన విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ.
అప్పుడప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న డి శ్రీనివాస్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే విషయం బహిరంగ రహస్యమే.రేపో మాపో ఆయన చేరిక అనివార్యం కాబోతున్న నేపథ్యంలో, కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నిన్న జరిగిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అనేక విషయాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ వ్యవహారం పైనా స్పందించారట.శ్రీనివాస్ రాజ్యసభ సభ్యత్వం జూన్ తో ముగియబోతోంది.ఆ లోపు గనుక ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఆయనపై అనర్హత వేటు వేయించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారట.
డీఎస్ పై అనర్హత విషయం లో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అసలు డి శ్రీనివాస్ టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరాలి అనుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.టిఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో పాటు, కేసీఆర్ దూరం పెట్టడం వంటి కారణాలతో ఆయన టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ఇక డీఎస్ కుమారుడు అరవింద్ నిజామాబాద్ ఎంపీ గా ఉన్న సంగతి తెలిసిందే.