తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచాలని బీజేపీ తమ కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.
అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కెసీఆర్ టార్గెట్ గానే విమర్శల వర్షం కురిపిస్తూ ప్రజల్లోకి రోజురోజుకో సరికొత్త విధానంతో వెళ్తున్న పరిస్థితి ఉంది.ఇందులో బీజేపీకి ఏ మాత్రం మినహాయింపు లేదు.
అయితే బీజేపీ ఎంతగా విమర్శిస్తున్నా కెసీఆర్ నుండి కనీసం ఏ ఒక్క సారి కూడా స్పందన వచ్చిన పరిస్థితి లేదు.
ఇక ఇదే అదునుగా చూసుకొని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో చాలా రకాల కఠినమైన పదాలు ఉపయోగించి కెసీఆర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం నిత్యం రకరకాల పరిస్థితుల్లో చూస్తున్నాం.
అయితే రెండో దఫా ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు కలిసి ముఖ్యమంత్రి కెసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్కటై పావులు కదిపినా కెసీఆర్ ఘన విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ ఒక్కటై కెసీఆర్ కు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.అయితే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ల విషయంలోనే కెసీఆర్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసిన తరువాత కెసీఆర్ కు రాష్ట్రంలో అనుకూల వాతావరణం అనేది పెరుగుతుంది.అందుకే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా జోనల్ వ్యవస్థ ఆధారంగా ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.