రోజాగారిలా అసెంబ్లీకి వెళ్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ!

అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో సక్సెస్ సాధించడం అందరికీ సాధ్యం కాదు.రోజా మాత్రం ఈ రెండు రంగాలలో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

 Anchor Anasuya Comments Viral In Jabardast Show Details Here, Anchor Anasuya, R-TeluguStop.com

వరుసగా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న రోజా 2024 ఎన్నికల్లో కూడా మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని నమ్ముతున్నారు.అయితే రోజాలా తనకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని అనసూయ జబర్దస్త్ షోలో చెప్పుకొచ్చారు.

అనసూయ కామెంట్లకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ప్రోమోలో అనసూయ ఆదితో కలిసి నందమూరి నాయకా పాటతో ఎంట్రీ ఇచ్చారు.

మొన్న పుష్ప స్పూఫ్ స్కిట్ చేయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందని అనసూయ ఆదిని అడగగా ఆది అసలు మనిద్దరి గురించి మీటింగ్ ప్లాన్ చేయాలా? డేటింగ్ ప్లాన్ చేయాలా? లేదా ఏదైనా ఈటింగ్ ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుండగా అని చెప్పగా ఈ లాస్ట్ టింగు గురించి ఆది నాకు రిహార్సల్స్ లో చెప్పలేదని అనసూయ చెబుతారు.

ఆది వెంటనే అన్ని టింగులు చెబితే ఇన్ని టింగులు ఉండవు అంటూ కామెంట్లు చేశారు.ఆ తర్వాత అనసూయ ఆదితో నువ్వు చూస్తూ ఉండు ఏదో ఒకరోజు రోజా గారిలా నేను కూడా అసెంబ్లీకి వెళతానని చెప్పగా నీకు ఇప్పటికే ఫేస్ బుక్ లైవ్ లో చాలా సమస్యలు ఉన్నాయని అసెంబ్లీ సమస్యలు ఎందుకని ఆది రివర్స్ లో ప్రశ్నిస్తాడు.ఫిబ్రవరి నెల 3వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

అయితే గతంతో పోలిస్తే జబర్దస్త్ లో కామెడీ తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కొందరు టీమ్ లీడర్లు జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడం కూడా ఈ షోకు మైనస్ అవుతోంది.ఈ షోను వదిలేసిన చాలామంది కమెడియన్లు స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో దర్శనమిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube