అదృష్టం అంటే ఇదే.. తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు..

రోడ్డు ప్ర‌మాదం ఎంత డేంజ‌ర్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఏ మాత్రం పొర‌పాటు జ‌రిగినా స‌రే ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి.

 This Is What Luck Means He Narrowly Escaped From Danger Details, Lucky Man, Vira-TeluguStop.com

చిన్న చిన్న పొర‌పాట్లే అత్యంత దారుణ‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తాయి.ప్ర‌మాదం అంటే కేవ‌లం ఆ వ్య‌క్తి మ‌ర‌ణించ‌డ‌మో లేదంటే గాయాల పాల‌వ్వ‌డ‌మో కాదు క‌దా.

అత‌న్ని న‌మ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద ప‌డ‌టం అని అర్థం.అయితే యూత్ మాత్రం బైక్ రైడింగ్లు ఆప‌ట్లేదు.

ఇష్టం వ‌చ్చిన‌ట్టు బైక్ న‌డిపేస్తూ చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.ఇలాంటి వీడియోలు నెట్టింట్లో అనేకం వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా పాపుల‌ర్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.యాక్సిడెంట్ వీడియోలు ఎన్ని చూసినా స‌రే.ఈ యూత్ మాత్రం ఇలాంటి ప‌నులు ఆప‌ట్లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ వీడియోలో ఉన్న వ్య‌క్తికి అదృష్టం బాగుందండోయ్‌.ఎందుకంటే అత‌ను క్ష‌ణ కాలంలో త‌న ప్రాణాల‌ను కాపాడుకున్నాడు.

ఏ మాత్రం ఆల‌స్యం చేసినా స‌రే త‌న ప్రాణాలు పోయండేవి.ఈ వైర‌ల్ వీడియోలో ఓ వ్య‌క్తి స్పీడుగా మోటార్ సైకిల్‌ను న‌డుపుకుంటూ రావ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే అత‌ను స‌డెన్ గా త‌న బైక్ మీద నుంచి స్లిప్ అయి కింద ప‌డిపోతాడు.కాగా అత‌ను ఆ బైక్ నుంచి విడిపోతాడు.అలా జారుకుంటూ వెల్తాడు రోడ్డు మీద‌.ఇంత‌లోనే వెన‌కాల నుంచి మెరుపు వేగంతో ఓ భారీ ట్రక్కు దూసుకొస్తుంది.దాన్ని గ‌మ‌నించిన ఆ వ్య‌క్తి వెంటనే లేచి ప‌క్క‌కు ప‌రుగెత్తుతాడు.క్ష‌ణం ఆల‌స్యం అయినా స‌రే ఆ ట్ర‌క్కు అత‌న్ని ఢీకొట్టేది.

ఇక ఆ బైక్ మీద నుంచి ఆ ట్ర‌క్కు ఎక్కుతుంది.ఆ త‌ర్వాత ట్ర‌క్కును ఆ డ్రైవర్ ఆపాడు.

ఇంత‌టి పెద్ద ప్ర‌మాదంలో ఆ బైక్ మీద వ్య‌క్తి చిన్న చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube