దళపతి 66.. 200 కోట్ల ఆఫర్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగు స్ట్రైట్ సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే.టాలెంటెడ్ డైరక్టర్ వంశీ పైడిపల్లితో విజయ్ 66వ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

 Thalapathi Vijay 66th Movie 200 Crores Business , 200 Crores Business, Dil Raju,-TeluguStop.com

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్.ఇంకా సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమా బిజినెస్ విషయంలో దూకుడు చూపిస్తుంది.

కాంబో ఫిక్స్ అవగానే భారీ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వచ్చినట్టు టాక్.అసలే నిర్మాత దిల్ రాజు బిజినెస్ విషయంలో చాలా క్లవర్ గా ఉంటారు.

ఈ క్రమంలో సెట్స్ మీదకు వెళ్లకుండానే విజయ్ 66వ సినిమా డిజిటల్, శాటిలైట్ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది.

దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.

సినిమాకు 200 కోట్ల భారీ డీల్ ఇచ్చారట జీ నెట్ వర్క్.దిల్ రాజు ఈ డీల్ ని చాలా తెలివిగా క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది.

థియేట్రికల్ బిజినెస్ కాకుండానే కేవలం డిజిటల్, శాటిలైట్ రైట్స్ తోనే విజయ్ 66వ సినిమా 200 కోట్లు రాబట్టింది.ఇది నిజంగా రికార్డ్ అని చెప్పొచ్చు.ఈ సినిమాను దళపతి విజయ్ అభిమానుల అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube