ఎయిర్‌టెల్‌తో మరో భారీ డీల్ కుదుర్చుకున్న గూగుల్..!

ప్రముఖ టెలీకాం సంస్థ రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ లో భారీ పెట్టుబడులు పెట్టిన గూగుల్.ఇప్పుడు మరో టెలీకాం సంస్థతో భారీ ఒప్పందానికి రెడీ అయింది.గ్లోబల్ ఇంటర్నెట్ కంపెనీ గూగుల్ తమ సంస్థలో దాదాపు రూ.7,400 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుందని టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ప్రకటించింది.పెట్టుబడులకు సంబంధించిన వరకూ ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికీ పలుమార్లు చర్చలు జరిగాయి.ఏడాదిన్నరగా గూగుల్ మేనేజ్‌మెంట్ – భారతి ఎయిర్‌టెల్ మధ్య పెట్టుబడులకు సంబంధించిన డిస్కషన్స్ విస్తృతంగా సాగాయి.

 Google Makes Another Big Deal With Airtel Google Makes Another Big Deal With Air-TeluguStop.com

ఇందులో 700 మిలియన్ డాలర్లను ఎయిర్ టెల్ లో 1.28% వాటా కొనుగోలుకు వ్యయం చేయనుంది.మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్ తో వాణిజ్య లావాదేవీలను కుదుర్చుకోనుంది.మన దేశపు డిజిటల్ ఎకోసిస్టమ్​ను మరింత ముందుకు తీసుకురావడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపింది.

దీనికోసం ఈ నిధులు అవసరమవుతాయని పేర్కొంది.వచ్చే ఐదేళ్లలో గూగుల్ ఈ నిధులను సమకూరుస్తుంది.

Telugu Airtel, Deal, Google-Latest News - Telugu

ఇన్నోవేటివ్ ప్రొడక్టుల ద్వారా గూగుల్, ఎయిర్​టెల్ ఇండియాలో డిజిటల్ వాడకాన్ని మరింత పెంచుతాయని చెప్పారు.లేటెస్ట్ నెట్‌వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, లాస్ట్​మైల్ డిస్ట్రిబ్యూషన్, పేమెంట్స్ ఎకోసిస్టమ్​ను డెవెలప్ చేస్తామని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు.భారతదేశంలో డిజిటల్ సేవలను అందించడంలో ఎయిర్ టెల్ ముఖ్య పాత్ర పోషిస్తుందని.ఈ కంపెనీతో కలసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.ఎక్కువ మంది భారతీయులకు మంచి ఇంటర్నెట్ యాక్సెస్‌ ను అందించేలా మేం ప్రయత్నిస్తాం’ అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.గూగుల్‌ భాగస్వామ్యంతో స్మార్ట్‌ ఫోన్స్‌, 5జి సేవల విస్తరణ, ఇంటర్‌నెట్‌ యూసేజ్‌, క్లౌడ్‌ సిస్టమ్‌పై పనిచేయనుంది ఎయిర్‌టెల్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube