బాలీవుడ్ డెబ్యూ కోసం రెడీ అవుతున్న హరీష్ శంకర్.. ఏ సినిమాతో అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలుసు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.

 Harish Shankar All Set For Bollywood Debut, Harish Shankar, Bollywood Debut, Paw-TeluguStop.com

వరుస ప్లాపులతో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ సాధించాడు పవర్ స్టార్.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘ సినిమాలో నటిస్తున్నాడు.

దీంతో పాటు యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటించాడు.పవన్ కోసం చాలా రోజుల నుండి హరీష్ ఎదురు చేస్తున్నప్పటికీ కరోనా కారణంగా మిగతా సినిమాల షూటింగ్ వాయిదా పడుతున్నాయి.

దీంతో వీరిద్దరి సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా సమయం పట్టేలా ఉంది.దీంతో హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టుటకే వినిపిస్తుంది.హరీష్ శంకర్ తెలుగులో అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాధం సినిమా తీసి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా ఇదే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు హరీష్.

డీజే సినిమా స్క్రిప్ట్ ను ఇప్పటికే హిందీ నేటివిటీకి తగ్గట్టుగా అక్కడి ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా రెడీ చేసేసాడట.డీలా రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ డీజే సినిమాను అక్కడ రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ యంగ్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నట్టు టాక్.త్వరలోనే ఈ సినిమాను హిందీలో అధికారికంగా ప్రకటించబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దీ రోజులు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube