రోజీతో నన్ను కలపండి సార్.. ఆన్లైన్ క్లాసులో శ్యామ్ సింగరాయ్ వినతి!

నాచురల్ స్టార్ నాని హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా పూర్వజన్మ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగారాయ్.ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన  విడుదలై ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది.

 Students Makes Fun Lecturer Shyam Singha Roy Name Shyam Singha Roy, Students,-TeluguStop.com

రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకావ్యం ప్రతి ఒక్క ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.థియేటర్లో ప్రతి ఒక్కరిని సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది.

ఇటీవల కాలంలో నెట్​ఫ్లిక్స్​ గ్లోబల్​ మూవీస్ జాబితాలో నాని శ్యామ్ సింగరాయ్ మూడో స్థానంలో నిలవడం విశేషం.ఇక సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమాకు దక్కని గౌరవం ఈ సినిమాకు దక్కిందని చెప్పవచ్చు.

ఈ సినిమాలో పూర్వజన్మలో ప్రేమకథ అంశం ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ తరహా లోనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సమయంలో తన లెక్చరర్ తో సరదాగా ఆట ఆడుకున్నాడు.

ఆన్లైన్ క్లాస్ లో జరుగుతున్న నేపథ్యంలో ఆ స్టూడెంట్ తన పేరు శ్యామ్ సింగరాయ్ తన భార్య పేరు రోజీ సింగరాయ్ అని ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలంటూ సదరు స్టూడెంట్ లెక్చరర్ ని కోరారు.ఇలా ఆ స్టూడెంట్ చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన లెక్చరర్ అది నిజంగానే తన పేరు లేకపోతే సినిమా పేరును తన ఐడిగా పెట్టుకున్నారా అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు.ఇదే విషయమై స్టూడెంట్ ను ప్రశ్నించడంతో నిజంగానే తన పేరుశ్యామ్ సింగ రాయ్ అని తన భార్య పేరు రోజి అని తన కూడా అదే క్లాస్ లో ఉందని పూర్వజన్మలో భార్యా భర్తలమని ఎలాగైనా మమ్మల్ని కలపాలని కోరడంతో సదరు లెక్చరర్ తనని పర్సనల్ గా కలవాలని సూచించారు.అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను శ్యామ్ సింగరాయ్​ చిత్రబృందానికి ట్యాగ్​ చేస్తూ ఆన్​లైన్​ క్లాస్​లో శ్యామ్ సింగరాయ్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇది చూసిన దర్శకుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube