ఒక్క టాలీవుడ్ పైనే వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నారట!

ఇండియాలో కరోనా వల్ల అనూహ్యంగా ఓటీటీ బిజినెస్ భారీగా పెరిగింది.మూడు నాలుగు సంవత్సరాల క్రితం డిజిటల్ సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు కానీ ఇప్పుడు అనూహ్యంగా పరిస్థితులు మారాయి.

 Zee5 Ott Plans For Telugu Subscribers  ,  Film News ,  News About Zee5 , Ott ,-TeluguStop.com

కరోనా వల్ల సినిమా థియేటర్లు మూత పడటంతో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ఫ్లాట్ఫామ్ ద్వారా సినిమాలను చూడడం మొదలు పెట్టారు.ప్రముఖ ఓటీటీ లు వందల కోట్లు ఖర్చు చేస్తూ ప్రస్తుతం వెబ్ కంటెంట్ నిర్మించే పనిలో ఉన్నారు.

అమెజాన్ మరియు నెట్ఫ్లిక్స్ తో పాటు ఆహా జీ5 ఇంకా హాట్స్టార్ వంటి పలువురు ఓటీటీ సంస్థలు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ లు నిర్మించు పనిలో ఉన్నాయి ఇదే సమయంలో టాలీవుడ్కు చెందిన భారీ చిత్రాలను కూడా కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి.ఇంతకుముందు కోటి రెండు కోట్లు మాత్రమే ఉన్న సినిమాల ఓటీటీ బిజినెస్‌ ఇప్పుడు పది నుంచి ఇరవై కోట్లకు మేరకు కూడా పలుకుతున్నాయి.

ప్రస్తుతం తెలుగులో అమెజాన్ ఆహా మరియు నెట్ఫ్లిక్స్ మాత్రమే భారీగా తమ ఖాతాదారులను కలిగి ఉన్నాయి.ఇంకా జీ5 మరియు సోనిలివ్ కూడా తెలుగు లో తమ ఖాతాదారులను పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.ముఖ్యంగా జి5 వారు ఏకంగా వెయ్యి కోట్లను ఖర్చు చేసి తమ ఖాతా దారులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.1000 కోట్ల రూపాయలతో భారీ సినిమాలను కొనుగోలు చేయడం జరుగుతోంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌ కొనుగోలు చేయడంతో పాటు పలువురు పెద్ద సినిమాలను కూడా కొనుగోలు చేయడం జరిగింది.

చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల నటించిన సినిమాలను కొనుగోలు చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తాజాగా రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను జి5 సంస్థ కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.జి5 ఇది భారీ మొత్తంను ఖర్చు చేసి మరీ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.హిందీ సినిమాలను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు తెలుగు సినిమాలను కూడా కొనుగోలు చేస్తున్నారు అందుకు గాను వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.కేవలం టాలీవుడ్ సినిమాలకు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే హిందీ మరియు ఇతర భాషల సినిమాలకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Zee5 Ott Plans For Telugu Subscribers , Film News , News About Zee5 , OTT , Telugu Ott , Zee5 ,cinema Theaters , Corona , Amezon , Netfilx , Aaha , Hotstar , - Telugu Aaha, Amezon, Theaters, Corona, Hot, Netfilx, Zee, Telugu Ott

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube