ఈ బాలుడి దర్జా మామూలుగా లేదుగా..!

మనలో చాలామందికి తొమ్మిదేళ్ల వయసులో ఫోన్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు.కానీ పెరుగుతున్న టెక్నాలజీ.

 Nine Year Old Nigerian Billionaire Mohammad Awwal Mustafa Details, Richest Rich-TeluguStop.com

పిల్లలకు స్మార్ట్ ఫోన్ ను దగ్గర చేసింది.దీంతో ఆరేళ్ళకే ఓ పిల్లాడు.

ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ కి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.ఈ పిల్లాడికి సొంతంగా ఒక ప్రయివేటు జెట్ ఉంది.

ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు.ప్రతి ఒక్కరూ ఔరా అనుకునేలా లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.నైజీరియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాయిలియా ముస్తఫా కొడుకు.మొహమ్మద్ అవాల్ ముస్తఫా. ఈ బుడ్డోడు కి ఇన్స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.ఇస్మాయిలియా ముస్తఫా మల్టీ మిలీయనీర్ కావడంతో.

ఈ బుడ్డోడు స్టైలీష్ క్లాతింగ్స్ వేసుకొని.ఖరీదైన కార్ల పక్కన నిల్చుని, ఖరీదైన భవంతుల ఎదుట నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చేవాడు.

ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవాడు.అలా తొమ్మిదేళ్ల వయసులోనే మిలియన్ కి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

తన కుమారుడికి ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే.మొహమ్మద్ అవాల్ కోసం.ఇస్మాయిలియా ఓ పెద్ద భవంతిని కట్టి.గిఫ్ట్ గా అందజేశాడు.

దాని గురించి ఆయన మాట్లాడుతూ.మన జీవితంలో ఏ కష్టం వచ్చినా.మనం ఏ విజయం సాధించినా ఎప్పుడూ మనల్ని ఒకేలా స్వాగతించేది మన ఇల్లు ఒక్కటే.అందుకే దీన్ని నీకు గిఫ్ట్ గా ఇస్తున్నానని తెలిపారు.దీన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నాడు అవాల్ ముస్తఫా.ఈ బుడ్డోడి విలాసవంతమైన జీవితాన్ని చూస్తున్న పలువురు.

లైఫ్ అంటే ఇలా ఉండాలి.నీలా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని కామెంట్ చేస్తున్నారు.

తొమ్మిదేళ్ల వయసుకే ఈ పిల్లాడు ఓ చిన్నపాటి సెలబ్రెటీ అయ్యాడు.

Nine Year Old Nigerian Billionaire Mohammad Awwal Mustafa Details, Richest Rich Kid, Latest News, Viral Latest, Viral News, Social Media,, Nine Year Old ,nigerian Billionaire ,mohammad Awwal Mustafa, Instagram, Luxury Life - Telugu Latest, Luxury, Mohammadawwal

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube