కుక్క తోక ప‌ట్టుకుని ముప్ప తిప్పలు పెడుతున్న కొండెంగ‌..

ఎలాంటి వీడియోలకైనా కేరాఫ్ అడ్రస్ సోషల్ మీడియా.ఇందులో కనిపించని వీడియో అంటూ ఏమీ ఉందదు.

 Monkey Troubling The Dog By Holding Its Tail Viral Details, Dog Tail, Viral Vide-TeluguStop.com

ఎలాంటి వీడియోలైనా ఇందులో దర్శనమిస్తాయి.దేశాలు, ప్రాంతాలకు సంబంధం లేకుండా ప్రపంచంలోని ఏ దేశానికి సంబంధించిన విషయాలైనా, వీడియోలైనా ఇందులో కనిపిస్తాయి.

కొంత మందికైతే సోషల్ మీడియానే ప్రపంచం.ప్రస్తుత కాలంలో సోషల్ మీడియానే అన్నింటికి వేదిక అయింది.

న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ కంటే ఫాస్ట్‌గా సోషల్ మీడియాలోనే విషయాలు ప్రజలకు తొందరగా రీచ్ అవుతున్నాయి.

దీంతో ప్రస్తుత తరం దాదాపుగా దీనిపైనే ఆధారపడింది.

ఇక అసలు విషయానికి వస్తే జంతువుల మధ్య గొడవ కామన్.అలా కాకుండా జంతువులు తమ జాతిని మరిచి ఫ్రెండ్ షిప్ చేయడం లాంటివి కూడా చాలా సార్లు చూశాం.

కుక్క పిల్లలకు పంది పాలు ఇవ్వడం లాంటి వీడియోలు సైతం జంతువుల్లో జాలి, కరుణ ఉన్నాయనడానికి నిదర్శనంగా నిలిచాయి.అయితే కొన్ని జంతువులు సరదగా వేరే జంతువులతో ఫైటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి.

ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఓ ఇంట్లో కుక్క, కొండెంగ ఉన్నాయి.

ఇందులో కుక్క కొంచెం డల్ గా కనిపిస్తుంది.కానీ కొండెంగ మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది.

దీంతో ఆ కుక్కను కొండెంగ నానా ఇబ్బందులు పెడుతోంది.కానీ దానిని కుక్క పట్టించుకోవడం లేదు.ముందుగా కుక్క అటువైపుగా వెలుతుంటే కొండెంగ దాని వెంట పడింది.ఆ కొండెంగ మనిషిలాగే నడవడం, పరుగులు తీయడం మొదలుపెట్టింది.ఇలా కుక్కను వెంబడించింది.తర్వాత అప్పటికీ కుక్క పట్టించుకోకపోవటంతో ఇక దాని తోకపట్టుకుని హంగామా చేసింది.

ముందుగా కుక్క తోక పట్టుకున్న కొండెంగ కింద పడింది.అయినా తోకను మాత్రం విడవలేదు.

చివరగా కిందపడి లేస్తున్నా.కుక్క తోకను మాత్రం కొండెంగ విడువలేదు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిని చూసిన నెటిజన్స్ కొండెంగ చేసిన చేష్టలకు పిధా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube