ఏపీ రాజ‌కీయాల‌పై షర్మిల మ‌నోగ‌తం ఇదే.. చెప్పేసిందిగా..!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల.ఆ రాష్ట్రంలో ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

 This Is Sharmila S Obsession With Ap Politics  As I Said  , Sharmila , Jagan , Y-TeluguStop.com

పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించింది.కానీ కరోనా కారణంగా అదికాస్తా వాయిదా పడింది.

పరిస్థితులను అనుకూలంగా మారిన తర్వాత తిరిగి పాదయాత్ర నిర్వహించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని టాక్.తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె.ఏపీలో పార్టీ ఎందుకు పెట్టకూడదని ఒకానొక సందర్భంలో ప్రశ్నించారు.దీంతో ఏపీ రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి.

షర్మిల ఏపీ రాజకీయాలపైనా ఫోకస్ పెట్టారా అంటూ గుసగుసలు వినిపించాయి.ఆమె ఏపీలోకి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అప్పట్లో పెద్ద చర్చలే నడిచాయి.

అయితే కేవలం ఎవరో అడిగిన ప్రశ్నకు మాత్రమే ఆమె అలా ఆన్సర్ ఇచ్చారని, నిజానికి ఏపీలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఆమెకు లేదని ఇంకొందరు చెప్పుకొచ్చారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో రాజకీయ పార్టీ పెట్టడంపై షర్మిల ఎలాంటి ప్రకటన చేయలేదు.తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ ప్రతినిధి ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు.కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అతడితో షర్మిల ముందుగానే వారించారు.

ఏపీ గురించి తనను ఏమీ అడగొద్దని ఆమె క్లారిటీ ఇచ్చారు.తనకు ఏపీ రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని, గతంలో జరిగిన ప్రచారం మొత్తం అవాస్తవమని చెప్పినట్టుగా ఆమె కామెంట్ చేశారు.

ఇదిలా ఉండగా షర్మిల పార్టీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందలేదు.ఆమె దరఖాస్తు చేసుకున్న వెంటనే గుర్తింపు ఇవ్వొద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.

ఎన్నికల సంఘానికి గతంలోనే ఫిర్యాదు చేశారు.వైఎస్ఆర్ పేరుపై మరో పార్టీ ఉంటే ప్రజలు గందర గోళానికి గురయ్యే చాన్స్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

Opposition Parties Comments on CM KCR Language PM Modi

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube