అక్కడ చేపలు పట్టడానికి సరికొత్త టెక్నిక్ ను వాడుతున్న మత్స్యకారులు..!

గత దశాబ్దంలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

 Fishermen Using The Latest Technique To Fish There Fish, Fishing, Latest News,-TeluguStop.com

మొత్తం ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వెంబడి పరుగులు తీస్తున్నారు.ఇలాంటి సందర్భంలోనూ కులవృత్తులను నమ్ముకున్న కొందరికి పని లేకుండా పోతుంది.

దీంతో పలువురు ఇప్పటికే వాటిని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా ఓ వృత్తి వారు మాత్రం వారి వృత్తిని మరువలేదు.

అదే మత్స్యకార వృత్తి.టెక్నాలజీ ని వాడుకొని వారు తమ కులవృత్తిని ఇంకా పెంచుకుంటున్నారు.

చేపలు పట్టేందుకు కొత్త కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చినా.సముద్రంలో చేపలు పట్టాలంటే మాత్రం వల వేయక తప్పదు.

కొందరు మత్స్యకారులు రాత్రిళ్ళు కూడా చేపల కోసం సముద్రాల్లో చేపలు పట్టడానికి వెళ్తుంటారు.అయితే, కొంచెం అడ్వాన్స్ గా ఆలోచించి.

నదిలో చేపలు పట్టేందుకు వెలుగును ఎరగా వేస్తారు.ఆ విధానాన్నే ఇప్పుడు సముద్రంలో కూడా మత్స్యకారులు ఫాలో అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, ఉప్పాడ ప్రాంతాల్లోని మత్స్యకారులు ఎందరో.తమ కులవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు.సముద్రం లోకి వేటకి వెళ్లి. చేపలను పట్టి అమ్మితేనే వారికి పూట గడుస్తుంది.అయితే.చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు రాత్రి సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సాధారణంగా అయితే, మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు తమ బోటు ఇంజన్ ఆపేసి, వలలు వేసి చేపలు పడుతుంటారు.కానీ, ప్రస్తుతం కాకినాడ, ఉప్పాడ ప్రాంతాల సమీపంలో దానికి విరుద్ధంగా జరుగుతోంది.

సముద్రంలో ఏర్పాటు చేసిన చమురు వెలికితీసే రిగ్గుల వద్ద మంటలు వస్తుండడంతో.చేపలు ఆ వెలుగు వస్తున్న దిశకు వెళ్తున్నాయి.

దీంతో ఇంజన్లు ఆపేసి వలలు వేస్తున్న మత్స్యకారులకు చేపలు దొరకడం లేదు.దీంతో మత్స్యకారులు ఆ రిగ్గులకు సమీపంలో ఉండి తమ బోట్ల లైట్లు ఆన్ చేస్తున్నారు.

ఆ వెలుతురుకు చేపలు రావడంతో గేలాలు వేసి చేపలను పడుతున్నారు.

Fishermen Using The Latest Technique To Fish There Fish, Fishing, Latest News, New Technology , Uppada , Kakinada - Telugu Fish, Latest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube