విరాట్ గుర్రానికి భావోద్వేగ వీడ్కోలు పలికిన ప్రధాని, రాష్ట్రపతి..!

గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి.అయితే, రాజ్‌ప‌థ్ లో నిర్వ‌హించిన‌ రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అందరిని అక‌ట్టుకుంది.

 Prime Minister And President Bid An Emotional Farewell To Virat Horse , Virat H-TeluguStop.com

భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగాయి.

రిపబ్లిక్‌ డే పరేడ్ తర్వాత ‘విరాట్’ కి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దగ్గరుండి వీడ్కోలు చెప్పారు.విరాట్ అంటే ఎవరో కాదు గుర్రం.

ఇది భారత సైన్యంలో సేవలు అందించింది.రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్​గా సేవలు అందించింది.

బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విరాట్ భారత రాష్ట్రపతిని తీసుకెళ్లి వీడ్కోలు తీసుకుంది.రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్ కల్నల్ అనూప్ తివారీ ఈ గుర్రాన్ని వాడుతున్నారు.

గత 13 సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇలా పాల్గొంటూ వస్తున్నారు.

విరాట్ వీడ్కోలుతో సిబ్బందిలో విషాదం నెలకొంది.2003లో హేంపూర్‌లోని రీమౌంట్ ట్రైనింగ్ స్కూల్ నుండి 3 సంవత్సరాల వయస్సులో ప్రెసిడెంట్స్ బాడీగార్డ్‌లో చేరినప్పటి నుంచి విరాట్ చిరస్మరణీయమైన సేవలు అందించింది.సాధారణంగా 17 లేదా 18 సంవత్సరాలకు గుర్రాలు రిటైర్ అవుతాయి.

విరాట్ ప్రస్తుత వయసు 21.సిబ్బందికి ఏళ్ల తరబడి విరాట్‌తో అనుబంధం ఉంది.ఈ ఏడాది ఈ గుర్రానికి ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ మెడల్ అందించి ఘనంగా వీడ్కోలు పలికారు.ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును అందుకున్న తొలి గుర్రం ఇదే కావడం విశేషం.

Telugu Narendra Modi, Prime, Rajnath Singh, Ramnath Kovind, Republicday, Latest,

విరాట్ కొన్ని డ్రస్సేజ్ కాంపిటీషన్‌లో పాల్గొంది.కోల్‌కతాలోని టోలీగంజ్ క్లబ్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొంది.విశిష్ఠమైన సేవలు అందించి, ప్రత్యేక సామర్థ్యాల కలిగిన గుర్రాలకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు.ఇంతటి ప్రత్యేకత కలిగిన గుర్రం కాబట్టే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు దానికి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube