తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం గుమ్మడి..

గుమ్మడి వెంకటేశ్వరరావు. ఇప్పటి తరం వారికి అంతగా తెలియదు కానీ.

 Unknown Facts About Gummadi Venkateswara Rao Details, Unknown Facts ,gummadi Ven-TeluguStop.com

పాత తరం జనాలకు పరిచయం అవసరం లేని పేరు.ఆయన నటన అద్భుతం, ఆయన మాటలు అత్యద్భుతం.

అభినయ కౌశలం, వాక్ చాతుర్యంతో ఏ పాత్రను అయినా అవలీలగా చేయగల సర్థుడు గుమ్మడి.ఎంతో గొప్ప ప్రతిభ ఉన్నా హీరోగా మాత్రం రాణించలేకపోయాడు గుమ్మడి.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుత సినిమాలతో జనాలను అలరించాడు.ఐదు దశాబ్దాల పాటు ఐదు వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.

జనాల మదిలో చెరగని ముద్ర వేశాడు.విలన్ పాత్రల్లోనూ నటించి మెప్పించిన ఘనుడు గుమ్మడి.

ఆయన నటించి ఎన్నో చిత్రాలు చక్కటి జనాదరణ పొందాయి.మహామంత్రి తిమ్మరుసు, ఈడు జోడు, కులదైవం, భలే రంగడు, జైజవాన్, వాగ్దానం, సిఐడి, రాజమకుటం లాంటి సినిమాల్లో గుమ్మడి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఎస్వీ రంగారావుతో పోటీ పడి నటించగల నటుడు అప్పట్లో గుమ్మడి మాత్రమే.ఈయన మాటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు.ఫో అవతలికి అనే పదాన్ని గుమ్మడి పదే పదే ప్రస్తావిస్తాడు.ఏ పాత్ర చేసినా.

నటన విషయంలో చిన్న రిమార్క్ కూడా రాకుండా చూసేవాడు.

Telugu Gumadi, Gummadi, Kantha Rao, Tollywood-Movie

సినిమా పరిశ్రమలో అందరితో చాలా క్లోజ్ గా ఉండేవాడు గుమ్మడి.అక్కినేని నాగేశ్వరరావు తో ఈయనకున్న సాన్నిహిత్యం మరికాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చే.గుమ్మడి చనిపోయే వరకు ఏఎన్నార్ తో మంచి సంబంధాలు కొనసాగించాడు.

జీవితం చివరి రోజుల్లో కాంతారావు, గుమ్మడి, ఏఎన్నార్ తరుచుగా కలుసుకుని ముచ్చటించే వారు.ఆయా అంశాల గురించి చర్చించుకునే వారు.

వీరంతా పలు కార్యక్రమాల్లో పాల్గొనే వారు కూడా.గుమ్మడి అనే నటుడు తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం.82 సంవత్సరాల పాటు జీవించి 2010 జనవరి 27న కన్నుమూశాడు.ఆ మహానటుడి వర్ధంతి నేడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube