ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.. నెట్టింట్లో వైరల్!

సాధారణంగా హీరోలు వారు చేసే సినిమాలకు అనుగుణంగా వారి బాడీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే పాత్రలు డిమాండ్ చేయడం బట్టి కొందరు అధిక బరువు పెరగడం లేదా మరి కొందరు బరువు తగ్గడం చేస్తుంటారు.

 Navdeep Love Mouli Movie First Look Viral Details,  Navdeep, Tollywood, Photo Vi-TeluguStop.com

అదేవిధంగా కొందరు పూర్తిగా వారి వేషధారణ కూడా మారుస్తుంటారు.ఎంతగా అంటే వారంతటవారే ఆ పాత్రలో నటించింది మేము అని చెప్పే వరకు కూడా మనం వారిని గుర్తుపట్టలేము.

ప్రస్తుతం అలాంటి పాత్రలో నటిస్తున్నారు యంగ్ హీరో నవదీప్.

ఎన్నో సినిమాల ద్వారా హీరోగా విలన్ గా పరిచయమైన నవదీప్ తాజాగా నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ మౌళి.

ఈ సినిమాలో హీరో నవదీప్ నటించగా హీరోయిన్ పాత్రలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం హీరో నవదీప్ పూర్తిగా వేషధారణ మార్చుకున్నారు.

ఈ క్రమంలోనే నవదీప్ జనవరి 26వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవడంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో నవదీప్ ఎవరూ గుర్తు పట్టలేని విధంగా ఒక అఘోర వేషధారణలో ఉన్నారు.ఇక నవదీప్ ఈ పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా అవనీంద్ర నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్రబృందం తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube