దర్శకులను బయపెడుతున్న హీరోయిన్ భక్తి.. మాకు అంత వొద్దంటూ?

సాధారణంగా ఇండస్ట్రీలో పని చేసే వారికి ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి.ముఖ్యంగా వారి సినిమా టైటిల్ విషయంలో కానీ సినిమాలలో తీసుకునే ఇతర ఆర్టిస్టుల విషయంలో కానీ, లేదా సినిమా విడుదల తేదీ వంటి వాటిలో ఎన్నో రకాల నమ్మకాలను విశ్వసిస్తారు.

 Directors Unhappy With Spiritual Path Of Heroine , Directors Unhappy , Bollywood-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సెంటిమెంట్ ఆధారంగా కొందరు దర్శక నిర్మాతలు వారి సినిమాలను ప్రారంభించడం మనం చూస్తూ ఉంటాము.అయితే హీరోయిన్ల విషయానికి వస్తే చాలా మంది హీరోయిన్లకు ఆధ్యాత్మిక పరంగా ఏమాత్రం అవగాహన ఉండదు.

ఏదో సినిమా ప్రారంభం అప్పుడు మాత్రం కొబ్బరికాయ కొడుతూ కనిపిస్తారు కానీ అనంతరం చాలా తక్కువమంది హీరోయిన్లు మాత్రమే దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న సమంత మాత్రం తను నటించిన సినిమా విడుదలకు ముందు తప్పనిసరిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందనే విషయం మనకు తెలిసిందే.

గత నాలుగైదు సినిమాల విడుదల ముందు సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం మనం చూస్తున్నాము.ఇకపోతే “సూదు కవ్వుం” చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సంచితా షెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఎప్పుడు గ్లామరస్ డ్రెస్సులలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ ముద్దుగుమ్మ ఉన్నఫలంగా సాంప్రదాయమైన చీరకట్టులో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆధ్యాత్మికత మార్గాన్ని ఎంచుకోవడంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ హీరోయిన్ కమిట్ అయిన సినిమాలలో ఏ మాత్రం గ్లామర్ ఎక్స్ పోజింగ్ కి ఒప్పుకోవడం లేదు.

ఇలా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలకు కమిట్ అయిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మికత వైపు పయనించడంతో సదరు దర్శకనిర్మాతలు ఒక్క సారిగా షాక్ అవుతున్నారు.ఆ సినిమాలు పూర్తి చేయాలంటే గ్లామరస్ లుక్ లో కనిపించాలి.అలాంటి లుక్ లో కనిపించడానికి ఈ హీరోయిన్ ఒప్పుకోకపోవడంతో దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే చీరకట్టులో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఇకపై అలాంటి పాత్రల్లోనే నటిస్తానని చెప్పడంతో దర్శకులు మాత్రం అంత భక్తి మాకు వద్దు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్ ఇలా ఉన్నఫలంగా ఆధ్యాత్మికత వైపు పయనించడానికి గల కారణం ఏమిటి ఈమెలో ఇంత ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు అనే విషయం గురించి ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు.

Heroine Sanchita Shetty Not Interested in Glamour Roles

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube