చీర‌ల‌పై ఐల‌వ్ యూ అని ముద్రించిన వ‌స్త్ర వ్యాపారులు.. నెటిజ‌న్ల ఫైర్‌

ప్రస్తుతం టెక్నాలజీ ఎంత పెరిగిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతోంది.

 Textile Merchants Printing I Love You On Sarees , Netizens' Fire , Love Sarees-TeluguStop.com

నిమిషాల్లోనే అందరికీ తెలిసిపోతున్నది.రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

ఓ చీరల వ్యాపారి చేసిన పనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.చీరల బిజినెస్ చేస్తే.

వాటిలో చర్చకుదారి తీసే అంశం ఏముంటుంది అనుకుంటున్నారా? అవును మీ అనుమానం నిజమే.సదురు వ్యాపారి చీరలపై అభ్యంతరకరమైన డిజైన్లు ఉన్నాయి.

ఇంకేముంది అందరూ కలిసి రోడ్డెక్కారు.సదురు వస్త్ర వ్యాపారులు అమ్ముతున్న చీరలను వెంటనే నిషేదించాలంటూ నిరసనలకు దిగారు.

Telugu Love Sarees, Netizens, Textile, Textiletrade-Latest News - Telugu

అసలు విషయం ఏంటంటే.రాజస్థాన్‌ లో ఉన్న కరౌలీ జిల్లాలో చీరలపై.స్థానికంగా వస్త్రాలు విక్రయిస్తున్న వ్యాపారులు వాటిపై ఐలవ్ యూ అని ముద్రిస్తున్నారు.వాటిని అందరికీ అమ్ముతున్నారు.అక్కడి మీనా వర్గీయులు వీటిని గమనించి రోడ్లపైకి చేరుకుని నిరసనలు తెలియజేశారు.వ్యాపారులు మాత్రం స్వలాభం కోసం స్థానికంగా ఉన్న సంస్కృతిని మరిచిపోయారని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై మీనా సమాజ్ సభ్యులు తోడభీం సబ్ డివిజన్ మెయిన్ ఆఫీస్‌కు వచ్చి.వ్యాపారులతో సమావేశమయ్యారు.

చర్చల అనంతరం ఇలాంటి వస్త్రాలను ఇక అమ్మబోమని వ్యాపారులు తెలిపారు.భవిష్యత్తులోనూ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చేసుకుంటామని స్థానికులకు వ్యాపారులు హామీ ఇచ్చారు.

అనంతరం వ్యాపారులు గ్రామస్తులకు సారీ చెప్పారు.ఈ తతంగం తర్వాత టెక్స్‌టైల్ ట్రేడ్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది.

ఇలాంటి వస్త్రాలను ఎవరూ అమ్మకూదడని నిర్ణయించుకున్నారు.అలాంటి వస్త్రాలను సైతం ఆర్డర్ చేయొద్దని వ్యాపారులంతా కలిసి డిసైడ్ అయ్యారు.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వస్త్రాలు అమ్ముకునేందుకు ఇదేం పాడు పని అంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube