ఢిల్లీలో ఆకాశంలో అద్భుతం.. డ్రోన్ల‌తో ఏం చేశారో తెలిస్తే..

జ‌న‌వ‌రి 26న అంటే బుధ‌వారం మ‌న ఇండియా మొత్తం అంగ‌రంగ వైభ‌వంగా గ‌ణతంత్ర దినోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేసుకుంది.ఈ ఒక్క వేడుక మాత్రం ఎలాంటి బేధాలు లేకుండా అంద‌రూ స‌మానంగా జ‌రుపుకుంటారు.

 The Sky In Delhi Is Amazing If You Know What Happened With The Drones , Delhi N-TeluguStop.com

అయితే ఎవ‌రికి తోచిన విధంగా వారు గ‌ణతంత్ర వేడుక‌ను జ‌రుపుకుంటారు.కొంద‌రైతే దేశం మీద ఉన్న ప్రేమ‌ను వారు రాణిస్తున్న‌రంగాల్లో వారి నైపుణ్యాల ద్వారా తెలియ జేస్తుంటారు.

కొంద‌రు రైతులు దేశం ఆకారంలోనాటు వేసి తెలియ‌జేసిన వీడియోలు, ఫొటోలు బాగా పాపుల‌ర్ అయ్యాయి.

అయితే ఇంకొంద‌రేమో చిన్నారులు దేశం ఆకారంలో నిల్చుని ఈ వేడుక‌ను జ‌రుపుకున్నారు.

ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా దేశం మీద ఉన్న ప్రేమ‌ను చూపిస్తే… ఢిల్లీలో ఇంకొంచెం వైభ‌వంగా నిర్వ‌హించారు.అయితే అది అంద‌రికీ క‌న్నుల పండుగ‌గా మారిపోయింది.ఇప్ప‌టి వ‌ర‌కు మేము చెప్పింది కేవ‌లం భూమ్మీద జ‌రిపిన వేడుక గురించి మాత్ర‌మే.అదే ఆకాశంలో చేస్తే ఇంకెలా ఉంటుంది.

ఇందుకోసం ఢిల్లీలోని విజ‌య్ చౌక్ వ‌ద్ద సాయంత్రం ఆకాశంలో అద్భుతం జ‌రిగింది.వేలాది డ్రోన్ల‌తో ఆకాశంలో విన్యాసాలు చేశారు.

ఆకాశంలో ఈ వేలాది డ్రోన్ల‌తో ఇండియా మ్యాప్ తో పాటుగా మ‌హాత్మా గాంధీ, మేకిన్ ఇండియా సింబ‌ల్ ను తీర్చిదిద్ది అద్భుతంగా ప్ర‌ద‌ర్శింప జేశారు.అయితే ఆకాశంలో దాదాపు 10 నిమిషాల దాకా ఈ అద్భుతాన్ని ప్ర‌ద‌ర్శించారు.దీన్ని వీక్షించేందుకు అక్క‌డ‌కు చాలామంది పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు.దీన్ని త‌మ ఫోన్ల‌లో భ‌ద్రంగా దాచుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోల‌ను నెట్టింట్లో షేర్ చేయ‌గా.విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దీనిపై చాలామంది స్పందిస్తున్నారు.ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసిన పెద్ద దేశంగా ఇండియా నిలిచింది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో మీద చాలామంది వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube