రూ.100కే విమానం కొనుగోలు చేసి ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది.. ఆమె టాలెంట్ గురించి తెలిస్తే...!

సాధారణంగా ఒక విమానం కొనాలంటే రూ.కోట్లల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.అలాంటిది 101 రూపాయలకే విమానం లభిస్తుందంటే నమ్ముతారా? కానీ ఒక మహిళ కేవలం రూ.101కే విమానం సొంతం చేసుకుంది.ఇదేదో బొమ్మ విమానం అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే.ఎందుకంటే ఆమె నిజంగానే నిజమైన విమానాన్ని రూ.101కే కొనుగోలు చేసింది.ఇప్పుడు ఆ విమానంతోనే కోట్లాది రూపాయలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.అదెలా సాధ్యం? 101 రూపాయలతో కోట్లు సంపాదించేంత టాలెంట్ ఉన్న ఆ మహిళ ఎవరు? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 She Bought A Plane For Rs 100k And Is Now Earning Crores   If She Knew About The-TeluguStop.com

2021లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ కు చెందిన బోయింగ్ 747 అనే ఓ విమానం తన సేవల నుంచి రిటైర్ అయ్యింది.బాగా పాతది అయిపోయిన ఈ విమానాన్ని షెడ్డుకే పరిమితం చేశారు బ్రిటిష్ ఎయిర్‌వేస్ అధికారులు.అయితే ఇలా నిరుపయోగంగా పడటం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని భావించి దాన్ని వదిలించుకోవాలి అనుకున్నారు.ఇంత పెద్ద విమానాన్ని ఎక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయరు కాబట్టి కేవలం ఒక యూరోకి (దాదాపు రూ.101) విక్రయానికి పెట్టారు.అయితే ఈ విషయం తెలుసుకున్న కాట్స్‌వోల్డ్ ఎయిర్‌పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుజనా హార్వే వెంటనే రూ.102 (ఒక యూరో) చెల్లించి ఈ పాత విమానాన్ని కొనుగోలు చేసింది.ఆ తర్వాత పాత విమానాన్ని ఆకర్షణీయంగా మార్చేసింది.ఈ ఏరోప్లేన్ మేక్ఓవర్ కోసం దాదాపు రూ.5 కోట్ల మేర ఖర్చు పెట్టింది.ఆ విధంగా దాన్ని లగ్జరీ బార్ అండ్ రెస్టారెంట్‌గా మలిచింది.

అయితే ఇది చూడటానికి చాలా కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రజలు పోటెత్తుతున్నారు.ఇందులో ప్రైవేట్ మీటింగ్‌లు, పార్టీలు నిర్వహించేందుకు కూడా చాలామంది క్యూకడుతున్నారు.

అయితే సరికొత్త అనుభూతి అందించే తమ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒక గంట సమయం గడపాలంటే రూ.1 లక్ష చెల్లించాల్సిందేనని యజమాని సుజనా ప్రకటించింది.అయినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.ఎందుకంటే ఇది విమానంలో కూర్చున్నంతగా ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.అంతేకాదు, 5 స్టార్ హోటల్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఇందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.కంఫర్టబుల్ సీటింగ్, మంచి ఆంబియెన్స్‌తో ఇది ఒక సరికొత్త లోకంలో ఉన్నామనే ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది.

అందుకే ఇందులో సమయం గడిపేందుకు చాలా మంది ముందడుగు వేస్తున్నారు.అయితే కేవలం గంటకే ఒక్క లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న సుజనా హార్వే ప్రతిరోజు లక్షల్లో సంపాదిస్తోంది.

అలా ఒక్క ఐడియాతో ఇప్పటికే రూ.కోట్లాది రూపాయలు సంపాదించింది.ప్రస్తుతం ఈ పార్టీ ప్లేన్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Bought a Junk Plane for just Rs100, now earning Crores

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube