తొలి రోజుల్లో టూత్ బ్రష్ ఎలా ఉండేదో తెలుసా? దీనిని ఎవ‌రు త‌యారు చేశారో తెలిస్తే...

టూత్ బ్రష్‌లు లేని ఉదయాన్ని ఊహించలేం.టూత్ బ్రష్‌కు 500 ఏళ్ల చ‌రిత్ర ఉంది.

 Do You Know What A Toothbrush Looks Like In The Early Days Daily Use People Morn-TeluguStop.com

టూత్ బ్రష్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా.జూన్ 26, 1498లో చైనా రాజు డాతున్ కంటే దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడే బ్రష్‌ను రూపొందించారు.

జూన్ 26ని టూత్ బ్రష్ డేగా జరుపుకుంటారు.తొలినాళ్ల‌లో టూత్‌ బ్రష్‌ల హ్యాండిల్‌ను ఎముక లేదా వెదురు చెక్కతో తయారు చేసేవారు.పంది వెంట్రుకలను పళ్లు రుద్దడానికి ఉపయోగించారు.1780లో విలియం అడిస్ అనే వ్యక్తి ఇంగ్లాండ్‌లో ఆధునిక టూత్ బ్రష్‌ను తయారుచేశాడు.అయితే పేటెంట్ విషయంలో అమెరికా గెలిచింది.నవంబర్ 7, 1857లో అమెరికాకు చెందిన హెచ్‌ఎన్‌ వాస్వర్త్ టూత్ బ్రష్ కోసం పేటెంట్ పొందాడు.1938 నుంచి టూత్ బ్ర‌ష్‌ల‌ భారీ ఉత్పత్తి ప్రారంభ‌మ‌య్యింది.

ఈ రోజుల్లో టూత్‌బ్రష్‌ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న‌ప్ప‌టికీ, చాలా మందికి దీన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియడం లేదని దంత వైద్యులు చెబుతుంటారు.సెల్యులాయిడ్ ప్లాస్టిక్ బ్రష్ హ్యాండిల్స్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రూపొందాయి.1938లో జంతువుల వెంట్రుకలకు బదులుగా నైలాన్ బ్రిజిల్స్‌ ఉపయోగించారు. 1939లో స్విస్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వచ్చింది.టూత్ బ్ర‌ష్ లేని జీవితాన్ని ఊహించ‌లేమ‌ని అత్య‌ధికులు ఒక స‌ర్వేలో తెలిపారు.

First Toothbrush History First Toothbrush Toothbrush History #Facts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube