ఆ సినిమాను తెలుగులోనే కాదు అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదట!

అజిత్ హీరోగా నయనతార హీరోయిన్ గా శివ దర్శకత్వంలో వచ్చిన విశ్వాసం సినిమా తమిళ నాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా ను తెలుగు లో రీమేక్‌ చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపించారు.

 Ajith Tamil Vishwasam Remake Problems Details, Hero Ajith, Ajith Vishwasam Movie-TeluguStop.com

ఒక నిర్మాత రీమేక్‌ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చి పలువురు స్టార్‌ హీరోలను సంప్రదించాడు.కాని ఏ ఒక్క హీరో కూడా ఆయన ప్రపోజల్‌ ను కమిట్‌ అయ్యేందుకు ముందుకు రాలేదు.

మొదట రీమేక్ కు ఓకే చెప్పినా కూడా ఆ తర్వాత నో అన్నట్లుగా సమాధానం వచ్చింది.దాంతో ఈ సినిమా రీమేక్ తెలుగు లో రాలేదు.

దాంతో డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు.తెలుగు లో విశ్వాసం పెద్దగా సక్సెస్ కాలేదు.

కనుక రీమేక్ చేయక పోవడం మంచిది అయ్యింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా ను హిందీ లో రీమేక్ చేయడం కోసం ఒక నిర్మాత ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు రీమేక్‌ రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

కాని రీమేక్ కు ఏ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు.షారుఖ్ ఖాన్‌ మొదలుకుని అక్షయ్‌ కుమార్‌ మరియు అజయ్ దేవగన్‌ ల వరకు ఏ ఒక్కరు కూడా విశ్వాసం పట్ల విశ్వాసం ను చూపించడం లేదు.

Telugu Ajith, Ajith Vishwasam, Akshay Kumar, Nayanthara, Hindi, Kollywood, Sharu

దాంతో సినిమా హిందీ లో కూడా వచ్చేది అనుమానం గా మారింది.హిందీ లో విశ్వాసం రీమేక్ చేయాలంటే చాలా మార్పులు అవసరం అని హీరో లు భావిస్తున్నారట.ఒక వేళ ఆ స్థాయి లో మార్పులు చేస్తే సినిమా ప్లేవర్‌ పోయి సినిమా ఫలితం పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అందుకే అజిత్‌ విశ్వాసం ను తెలుగు లోనే కాకుండా హిందీ లో కూడా రీమేక్ చేయబోవడం లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube