ఏపీలో కాపు నేతలు ఏం చేయబోతున్నారు? వారి నెక్ట్స్ టార్గెట్ ఏంటి?

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే నడుస్తుంటాయి.కాలమేదైనా సరే ఇక్కడి రాజకీయ వేడి మాత్రం ఎప్పుడూ భగ్గుమంటుంది.

 What Are The Farmer Leaders Going To Do In Ap? What Is Their Next Target?, Ap Po-TeluguStop.com

ఈ రాజకీయ వేడి ఎప్పటికీ చల్లారనే చల్లారదు.కేవలం రాజకీయ వేడి మాత్రమే కాకుండా కులాల సమీకరణాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో బాగానే ఉంటాయి.

ఇక్కడ ఉన్నన్ని కులాల సమీకరణాలు మన దేశంలో మరెక్కడా కనిపించవు.అందుకోసమే ఏపీ రాజకీయాలు అంత హాట్ హాట్ గా నడుస్తాయి.

ఈ కొత్త ఏడాది 2022 ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారుకు ఏ మాత్రం కలిసి రావడం లేదని కొందరు చెబుతున్నారు.ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు.

దీంతో నే ప్రభుత్వానికి పెద్ద చిక్కొచ్చి పడిందంటే… మరో వైపు రాష్ట్రంలోని కాపులంతా పార్టీలకు అతీతంగా సమావేశమయ్యారు.ఎలాగైనా సరే కాపుల సత్తా ఏంటో చూపించాలని అంటున్నారు.

ఇది ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది.ఇంతకీ ఏం జరిగిందంటే.

ఏపీ రాష్ట్రంలో ఉన్న కాపులు వర్చువల్ గా సమావేశమయ్యారు.ఈ సారి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో కాపులకు ప్రాధాన్యం లేదని వారు ఆరోపిస్తున్నారు.అంతే కాకుండా కాపు కార్పొరేషన్ ద్వారా కూడా ఎలాంటి పనులు జరగడం లేదని వాపోతున్నారు.ఇలా అయితే కాపులు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి పోతారని అంటున్నారు.

అందుకోసమే ఈ సారి పార్టీలకు అతీతంగా కాపుల ప్రయోజనాల కోసం ఒక్కటిగా పని చేయాలని నిశ్చయించుకున్నారు.

ఈ పరిణామం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.కాపులంటే ముందుగా గుర్తుకు వచ్చేది ముద్రగడ పద్మనాభం.అటువంటి నాయకుడు లేకుండా కాపులు సమావేశమయ్యారు.

మరి వీరి సమావేశం ముందుకు సాగుతుందో లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతుందో వేచి చూడాలి.

What Are The Farmer Leaders Going To Do In AP? What Is Their Next Target?, Ap Politics, Janasena , Ysrcp , Mudragada , Ys Jagan , Ap Poltics - Telugu @janasenaparty, Ap, Ap Poltics, Janasena, Mudragada, Pawan Kalyan, Ys Jagan, Ysrcp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube