బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ ఇల్లు చూశారా.. ఇంద్రభవనం అనిపించేలా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన సెలబ్రిటీలలో విశ్వ కూడా ఒకరు.బిగ్ బాస్ షో ద్వారా విశ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు, పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

 Bigg Boss Contestant Vishwa Home Tour Video Goes Viral In Social Media , Goes Vi-TeluguStop.com

బిగ్ బాస్ షోకు ముందు సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా విశ్వ ప్రేక్షకులకు సుపరిచితమే అయినా బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాతే ఈ కంటెస్టెంట్ కు క్రేజ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరిగింది.బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అద్భుతంగా చేయడం ద్వారా విశ్వ క్రేజ్ ను మరింత ఎక్కువగా పెంచుకున్నారు.

విశ్వకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉండగా ఆ ఛానల్ కు రోజురోజుకు ప్రేక్షకాదరణ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.తాజాగా విశ్వ సొంతింటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

విశ్వ అడ్డా పేరుతో యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టిన విశ్వ తాను పావనీ రెసిడెన్సీలో ఉంటానని తెలిపారు.ఇంద్రభవనాన్ని తలపించేలా ఉండే ఈ ఇంటిని 2017 సంవత్సరంలో నిర్మించుకున్నానని విశ్వ అన్నారు.

ఈ ఇల్లు సొంతిల్లు అని ముంబైలో అద్దె ఇల్లు ఉందని విశ్వ అన్నారు.వీడియోలో తన ఫోటోలను, తనకు వచ్చిన అవార్డులను విశ్వ అభిమానులతో పంచుకున్నారు.

తాను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయిందని విశ్వ తెలిపారు.తాను క్రికెటర్ అని క్రికెట్ ద్వారా కూడా అవార్డులను గెలుచుకున్నానని విశ్వ వెల్లడించారు.

హమీదా ఇచ్చిన గిఫ్ట్ ను కూడా విశ్వ వీడియోలో చూపించారు.

యువ సీరియల్ తో తన టీవీ కేరీర్ మొదలైందని విశ్వ చెప్పుకొచ్చారు.వీడియోలో తన అమ్మను చూపించిన విశ్వ అమ్మ ఎప్పుడూ వంట గదిలోనే ఏదో ఒక పని చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు.తన కూతురిని పరిచయం చేయడంతో పాటు తన కూతురి పేరు లాస్య అని విశ్వ వెల్లడించారు.

మా నాన్న యోగా గురువు అని నాన్నకు యోగా అంటే చాలా ఇష్టమని విశ్వ చెప్పుకొచ్చారు.తన కొడుకు ముంబైలో ఉన్నాడని తమ్ముడు కార్తీక్ పారిస్ లో ఉన్నాడని విశ్వ కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube