మేడారం మహా జాతర పనులు శర వేగంగా జరుగుతున్నాయి.. మంత్రి సత్యవతి రాథోడ్

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మీడియాతో మాట్లాడుతూ.కోవిడ్ మహమ్మారి ఉన్నా లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి గత రెండు వారాల నుంచే వరుసగా వస్తున్నారు.

 Minister Satyavathi Rathod Inspects Medaram Maha Jathara Works Details, Minister-TeluguStop.com

సీఎం కేసిఆర్ గారి ఆదేశాలతో జాతర కోసం కేటాయించిన 75 కోట్ల రూపాయలలో ఈసారి శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక వసతుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాము.జాతర పనులు శర వేగంగా జరుగుతున్నాయి.జంపన వాగు దగ్గర 2.5 కిలోమీటర్ల పొడవున భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం.దుస్తులు మార్చుకునే గదులు, స్నానానికి గదులు, షవర్లు ఏర్పాటు చేస్తున్నాం.ప్రధాన ఆలయం చేరేందుకు అన్ని సీసీ రోడ్లు రూ.13 కోట్లతో చేపడుతున్నాం.జనవరి 31 నాటికి ఈ పనులు పూర్తి అవుతాయి.గిరిజన సంక్షేమ శాఖ చేపట్టిన రూ.6 కోట్ల సులబ్ కాంప్లెక్స్ ల పనులు పూర్తి అయ్యాయి.

పంచాయతీ రాజ్ శాఖకు రూ.4 కోట్లు కేటాయిస్తే ఇస్తే 3.5 కోట్ల రూపాయల పనులు పూర్తి కాగా 50 లక్షల రూపాయలతో ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ పనులు జరుగుతున్నాయి.10 కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ గెస్ట్ హౌస్ శాశ్వత భవనం రానుంది.

ఇప్పటికే మేడారంలో 5 షేడ్స్, 100 టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చాము.షెడ్స్ విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా, వంటలు చేసుకునే విధంగా నిర్మించాం.రూ.4.5 కోట్లతో 3 కమ్యూనిటీ కిచెన్ షెడ్లు మంజూరు ఇచ్చాం.చాల్వాయి, తాడ్వాయి, ఇంచెర్ల ముఖ్య రహదారుల వద్ద నిర్మాణం చేస్తాం.30 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ వాటర్ టాంక్ నిర్మాణం చేశాం.

ఎక్కువగా శాశ్వత నిర్మాణాలకు వెచ్చించాం.హై మాస్ట్ లైట్స్ గతంలో కిరాయికి తీసుకొచ్చే వాళ్ళం.కానీ ఈసారి శాశ్వత ప్రాతిపదికన కొనుగోలు చేశాం.

జాతర తరవాత వీటిని గిరిజన గ్రామాల్లో వినియోగిస్తాము.కమ్యూనిటీ డైనింగ్ హాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నిర్మించాం.

తరవాత ఈ డైనింగ్ హాల్ ను పిల్లల కోసం వాడుతాం.పూజారులు కోసం రూ.25 లక్షలతో 5 గదుల నిర్మాణం జరుగుతుంది.గట్టమ్మ దగ్గర శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మించనున్నాం.

ఐటీడీఏ గెస్ట్ హౌస్ వెనుక కూడా శాశ్వత సీసీ రోడ్డు వేస్తున్నాం.ఇందుకు అధికారులు అంచనాలు ఇస్తారు.

మేడారం దేవాలయం నుంచి బయటకు వెళ్ళే దారికి పక్కన ఉన్న ఆక్రమణలు తీసేసి టి.ఆకారములో cc రోడ్లు వేయడం జరుగుతుంది.వాహనాల పార్కింగ్ వద్ద నీళ్ళు నిలువ ఉండకుండా పైప్స్ వేసి లెవెల్ చేస్తాం.ప్రతిసారీ పార్కింగ్ కోసం తమ పొలాలు ఇస్తూ సహకరిస్తున్న రైతులకు దాదాపు కోటి రూపాయల ఈ పనులు అప్పగించాము.

4200 లైట్స్ శాశ్వత ప్రాతపదికన ఈసారి కొనుగోలు చేసి, ఏర్పాటు చేస్తున్నాం.తరవాత వీటిని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పెడతాం.రెండు ట్రాక్టర్ ట్రాలీలు ఇచ్చాం.పారిశుధ్య నిర్వహణ కోసం వీటిని వినియోగిస్తారు.పిల్ల జాతరకు దాదాపు 2 కోట్ల రూపాయలు నిర్వహణ కోసం ఇచ్చాం.గుంజేడు, పునుగుంట్ల కోసం రూ.46 లక్షల రూపాయలు శాశ్వత నిర్మాణాలకు, అగ్రంపాడ్ లో 20 లక్షలు శాశ్వత నిర్మాణాలకి ఇచ్చాం.ఇంచర్ల, గట్టమ్మ, పాలంపేట వద్ద శాశ్వత నిర్మాణాలకు 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.అధికారులు అంతా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు.29వ తేదీన ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర స్థాయి విస్తృత సమీక్ష సమావేశం నిర్వహిస్తాం.కొవిడ్ ఉన్న కారణంగా పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ద పెట్టాము.వైద్య, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందిని అధికంగా నియమిస్తున్నం.

భక్తులు రద్దీగా ఉండే చోట, గుమి కూడే వద్ద మాస్క్ లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాము.ఎవరికైనా కొవిడ్ నిర్దారణ అయితే వారిని సురక్షితంగా ఉంచేందుకు ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేస్తాం.రాపిడ్/ఆర్.టి.పి.సి.ఆర్ టెస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.కొవడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రతిరోజూ రెండుసార్లు ఫాగింగ్ చేయిస్తాం.

ట్రాఫిక్ రద్దీ నిర్వహణకు ప్రత్యేకంగా అధికారులను పెట్టి నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.రహదారులన్నీ పూర్తిగా మరమ్మత్తులు చేసి, కొత్త రోడ్ల పనులు వేగంగా పూర్తి చేస్తున్నాం.

అమ్మవార్ల కరుణ ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా.మా ప్రయత్నం లోపం లేకుండా పనులు చేస్తాం.

భక్తులు కరోనా బారిన పడకుండా చూడాలని అమ్మవార్లకు ప్రార్థన.సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి.

సిబ్బందికి ధన్యవాదాలు.పనుల పరిశీలనలో భాగంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీమతి మాలోతు కవిత, ఎమ్మెల్యే శ్రీమతి సీతక్క, జెడ్పీ చైర్మన్ శ్రీ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube